అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓ రిపోర్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ ఫైరయ్యారు. ఆ రిపోర్టర్‌ను ‘గెట్ అవుట్’ అన్నారు. దీంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగు రోజుల విదేశీ పర్యటన కోసం మంగళవారం పశ్చిమాసియాకు వచ్చారు. మంగళవారం నుంచి 4 రోజుల పాటు సౌదీ, యూఏఈ, ఖతార్‌లో పర్యటించనున్నారు.
IND PAK War: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. ఆయన ఈ ప్రకటనను తన సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. అలాగే, ట్రంప్ ప్రకటన వెలువడిన కొన్ని నిమిషాల్లోనే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఈ విషయాన్ని ధృవీకరించారు. రెండు దేశాల సైనిక ఆపరేషన్ల డైరెక్టర్లు మధ్య మే 10వ తేదీ సాయంత్రం 3:35 గంటలకు మాట్లాడారు.…
JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వంశవ్యవస్థ, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై స్పష్టమైన వైఖరి ఉన్న జేడీ వాన్స్ ఈ వివాదంలో అమెరికా పాత్రపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భారత్, పాకిస్థాన్‌ల మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో తమ దేశం ఎలాంటి జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. Operation Sindoor 2:…
USA: భారతీయ టెక్కీ, ఎంటర్ప్రెన్యూర్ అమెరికాలోని వాషింగ్టన్లో తన భార్య, కొడుకును కాల్చి చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఏప్రిల్ 24న జరిగింది. మరో కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రోబోటిక్స్‌లో నిపుణుడు అయిన హర్షవర్ధన కిక్కెరీ హోలో వరల్డ్‌కి సహ వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ 2022లో మూతపడింది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఎల్ఓసీ దగ్గర నిరంతరం కాల్పులకు తెగబడుతోంది
అమెరికా రక్షణ కార్యదర్శి హీట్ హెగ్రేత్ రాజీనామా చేశారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కొత్త కార్యదర్శి కోసం వైట్‌హౌస్ వెతుకులాట ప్రారంభించిందని వార్తలు ప్రకారం అవుతున్నాయి.
అగ్ర రాజ్యం అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ-ట్రంప్ ప్రభుత్వం మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్ డాలర్ల నిధులను ట్రంప్ సర్కార్ నిలిపివేసింది. అంతేకాకుండా యూనివర్సిటీకి కల్పించే పన్ను మినహాయింపును కూడా నిలిపివేసింది. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ-ట్రంప్ సర్కార్ ప్రత్యక్ష పోరాటానికి దిగింది.
అగ్ర రాజ్యం అమెరికా రెండవ మహిళ ఉషా వాన్స్ భారత్‌కు చేరుకున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్యగా ఉషా ఢిల్లీలో అడుగుపెట్టారు. ఉషా చిలుకూరి పూర్వీకుల స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు.