అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సుంకాలపై విధించిన డెడ్‌లైన్ జూలై 9తో ముగుస్తోంది. ఇక ఈ డెడ్‌లైన్ పొడిగించే ప్రసక్తే లేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ స్పష్టం చేశారు. జూలై 9 లోగా అమెరికాతో ఆయా దేశాలు ఒప్పందాలు చేసుకోకపోతే.. ప్రతీకార సుంకాలు అమల్లోకి వచ్చేస్తాయి. అయితే గడువుకు ముందే కొత్త టారిఫ్ రేట్లను తెలియజేస్తూ ఆయా దేశాలకు అమెరికా లేఖలు పంపనుంది. శుక్రవారం నుంచి తమ వాణిజ్య భాగస్వాములకు లేఖలు పంపిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. తైవాన్ నుంచి యూరోపియన్ యూనియన్ వరకు.. అన్ని వాణిజ్య దేశాలకు లేఖలు పంపనున్నారు.
ఇది కూడా చదవండి: US: గగనతలంలో దారుణం.. విమానంలో ఘర్షణ.. వీడియో వైరల్
ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో వాణిజ్య ఒప్పందాలు భారీగా ప్రకటించే అవకాశం ఉందని అమెరికా అధికారులు సంకేతాలు ఇచ్చారు. ఇక అమెరికాతో యూకే, వియత్నాం మాత్రమే ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక బీజింగ్ పరస్పర ఉత్పత్తులపై సుంకాలు తాత్కాలికంగా తగ్గించుకోవడానికి అంగీకరించాయి. ఇక భారత్‌తో కూడా భారీ ఒప్పందం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: EMV Chip: డెబిట్ కార్డులో ఉండే చిన్న చిప్ ఒక మినీ కంప్యూటర్.. ఇది ఎలా పనిచేస్తుందంటే?
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ 2న ప్రతీకార సుంకాలను ప్రకటించారు. అనంతరం ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో ఎగుమతులు, దిగుమతుల టారిఫ్‌లపై నిర్ణయం తీసుకోవడం, వాణిజ్య ఒప్పందం చేసుకోవడం కోసం 90 రోజుల పాటు గడువు విధిస్తూ సుంకాల అమలును తాత్కాలికంగా ట్రంప్ నిలిపివేశారు. ఇక డెడ్‌లైన్‌లోగా అమెరికాతో డీల్ చేసుకోకపోతే ఆయా దేశాలపై ఇష్టానుసారంగా సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే భారత్, చైనా, బ్రిటన్ వంటి దేశాలు.. అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపాయి. మరికొన్ని గంటల్లో భారత్‌తో డీల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.