వైట్‌హౌస్ వేదికగా దిగ్గజ టెక్ సీఈవోలందరికీ ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. విందులో ట్రంప్ దంపతులిద్దరూ హాజరయ్యారు. విందులో సీఈవోలతో ట్రంప్ ప్రత్యేకంగా ఒక్కొక్కరితో సంభాషించారు. సొంత దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని కోరారు.

ఇలా సీరియస్ సంభాషణ జరుగుతుండగా గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాత్రం విచిత్రంగా ప్రవర్తించారు. పక్కనే కూర్చున్న మహిళా సీఈవోతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమె కూడా సెర్గీ బ్రిన్‌తో అలానే ప్రవర్తించింది. సెర్గీ బ్రిన్‌పై మాటిమాటికీ చేయి వేస్తూ కనిపించింది. కొన్ని సార్లు వీపుపై చేయి వేసి గోకుతూ కనిపించగా.. మరొకసారి తల నిమురుతూ కనిపించింది. ఇక సెర్గీ బ్రిన్ అయితే ఎడమ చేయి ఆమె మీదనే ఉంచాడు. వారి మధ్య ఉన్న క్లోజ్‌నెస్‌ను కెమెరామెన్ ఫోకస్ చేస్తూనే కనిపించాడు. అయినా కూడా ఏ మాత్రం భయపడలేదు. ట్రంప్ ఎదురుగా ఉండగానే ఇదంతా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఆ మధ్య ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఆస్ట్రోనోమర్ సీఈవో ఆండీ బైరాన్, హెఆర్ హెడ్ క్రిస్టిన్ కాబోట్ ఒక సంగీత కచేరికి వెళ్లి అండగా బుక్ అయ్యారు. ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం బయటపడింది. ఇద్దరూ క్లోజ్‌గా ఉన్నప్పుడు కెమెరామెన్ వారి మీద ఫోకస్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పచ్చని సంసారంలో కుంపటి తెచ్చిపెట్టింది. ఈ మధ్య ఉద్యోగినితో ప్రేమ వ్యవహారం నడిపినందుకు నెస్లే సీఈవో లారెంట్ ఫ్రీక్సేను కూడా సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది.