ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ మేరకు ట్రంప్ ప్రకటించారు. అనంతరం ఇజ్రాయెల్, ఇరాన్ కూడా ధృవీకరించాయి. అయితే తాజాగా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్ మండిపడింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 24 గంటల్లో దశల వారీగా కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించగా.. మధ్యలో అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చి ముఖ్యమైన అణు కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహన్‌లపై దాడులు చేసింది.
Iran-Israel War: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్ తాజాగా భారీ స్థాయిలో దాడులకు దిగింది. టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది.
PIB Fact Check: ఆపరేషన్ ‘మిడ్నైట్ హ్యామర్’ పేరుతో ఇరాన్ లోని అణు స్థావరాలపై అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే, ఈ దాడుల కోసం వినియోగించిన యూఎస్ విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.
Hormuz Strait: ఇజ్రాయెల్, అమెరికా వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా ఉన్న హర్మోజ్ జలసంధిని మూసి వేయాలని నిర్ణమం తీసుకుంది.
అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరఘ్చి ఆదివారం ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేయడాన్ని ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడైన అమెరికా అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా “నేరపూరిత ప్రవర్తన” కలిగి ఉందని అరఘ్చి ఆరోపించారు. “ఈ ఉదయం జరిగిన సంఘటనలు రెచ్చగొట్టేవి, దీర్ఘకాలిక…
ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు – ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై అమెరికా దాడులకు ఇస్లామిక్ రిపబ్లిక్ అణు ఆశయాలే కారణమని బహిష్కృత క్రౌన్ ప్రిన్స్ రెజా షా పహ్లవి ఆరోపించారు. సుప్రీం నాయకుడు ఖమేనీ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడిపై స్పందిస్తూ, రెజా షా పహ్లవి Xలో ఇలా రాసుకొచ్చారు.. “ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడులు ఇస్లామిక్ రిపబ్లిక్ అణ్వాయుధాల కోసం చేసిన వినాశకరమైన ప్రయత్నం ఫలితంగా…
హౌతీ రెబల్స్ అగ్ర రాజ్యం అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తే.. భవిష్యత్ లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. అలాగే, ఎర్ర సముద్రంలో యూఎస్ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించింది.