అమెరికా అధ్యక్షుడి నిర్ణయం ఇపుడు ఆక్వారంగంపై పిడుగు పడినట్టు చేస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ పై విధించిన 25 శాతం సుంకాలు అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఆక్వారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతోంది. నిన్నమొన్నటి వరకు రొయ్యలపై 3 నుంచి 4 శాతంగా ఉన్న సుంకాన్ని .. అమెరికా 25 శాతానికి పెంచడంతో ఎగుమతి చేయాలంటే ఇకపై భారీగా పన్నులు చెల్లించాలి.
కాలిఫోర్నియాలోని నావల్ ఎయిర్ స్టేషన్ సమీపంలో ఎఫ్-35 ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు అంటుకుని దట్టంగా పొగలు అలుముకున్నాయి. అయితే పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు.
Indian Oil Companies: భారత్‌పై అగ్రరాజ్యం అమెరికా 25 శాతం టారీఫ్స్ విధించిన వేళ మరో కీలక పరిణామం జరిగింది. ఇండియాకు చెందిన చమురు కంపెనీలపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు విధించింది.
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.8తో భూకంపం సంభవించింది. దీంతో రష్యాలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం రష్యాతో పాటు అమెరికా, జపాన్, కెనడా, న్యూజిలాండ్‌లకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఆగస్టు 1తో డెడ్‌లైన్ ముగుస్తుంది. కానీ ఇప్పటి వరకు భారత్-అమెరికా మధ్య మాత్రం ఒప్పందం ఖరారు కాలేదు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తు్న్నారు. కానీ సాధ్యం కావడం లేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కృషి చేస్తున్నారు. కానీ ఫలితాన్ని ఇవ్వలేదు.
పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అమెరికాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా శుక్రవారం వాషింగ్టన్లో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
హమాస్ అంతమే లక్ష్యంగా గత కొన్ని నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. వందలాది మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
ప్రధాని మోడీ అగ్ర రాజ్యం అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక ఆగస్టు చివరిలో గానీ.. సెప్టెంబర్ ప్రారంభంలో గానీ SCO సమ్మిట్ కోసం చైనా, జపాన్ కూడా సందర్శించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.