అమెరికాతో వాణిజ్య యుద్ధం నడుస్తున్న తరుణంలో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. ఎల్‌పీజీ దిగుమతిపై అమెరికాతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురీ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: బ్లాస్ట్‌కు ముందు 2 కీలక ఫోన్లు మిస్సింగ్.. ఉమర్ ఎవరికిచ్చాడు? పూర్తి డేటా వచ్చేసింది
భారత ప్రజలకు అందుబాటు ధరలో ఎల్పీజీని అందించే క్రమంలో కీలక ముందడుగు పడిందని కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పేర్కొన్నారు. యూఎస్ గల్ఫ్ కోస్ట్ నుంచి ఈ ఎల్పీజీ రానుందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో వెల్లడించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం కంపెనీలు అమెరికన్ సంస్థలతో గత కొన్ని నెలలుగా చర్చలు జరిపినట్లు వివరించారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
ప్రపంచంలోనే ఎల్పీజీ ఉపయోగించడంలో భారతదేశం రెండో అతి పెద్ద దేశం. ఇలాంటి తరుణంలో ఎల్పీజీ దిగుమతిపై అమెరికాతో కీలక ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఉజ్వల యోజన పథకం కింద కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. తాజా ఒప్పందంతో గృహవినియోగదారులందరికీ కూడా తక్కువ ధరకే ఎల్పీజీ దొరికే అవకాశం ఉంది. గతేడాది ఎల్పీజీ ధరలు ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం పెరిగినా.. భారత్‌లో మాత్రం ఉజ్వల లబ్ధిదారులకు కేవలం రూ.500-550కే లభించింది. తాజాగా అమెరికాతో ఒప్పందం ప్రకారం గృహ వినియోగదారులందరికీ ఉపశమనం లభించే ఛాన్సుంది.
India signs "historic" LPG deal with the US: Hardeep Puri
Read @ANI Story | https://t.co/yEs83rtats#LPG #US #India pic.twitter.com/cRsQNUfDRN
— ANI Digital (@ani_digital) November 17, 2025