అగ్ర రాజ్యం అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేసే బిల్లుకు అమెరికా చట్టసభ సభ్యులు ఆమోదించారు. 427-1 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ట్రంప్‌కు తీవ్రమైన మద్దతుదారుడు.. లూసియానా రిపబ్లికన్ ప్రతినిధి క్లే హిగ్గిన్స్ మాత్రమే ఓటు వేయలేదు.
ఇది కూడా చదవండి: Off The Record: పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారా?.. లేదా పక్కన పెడుతున్నారా?
విషయాన్ని బహిర్గతం చేయొద్దు అంటూ సభ్యులపై ట్రంప్ తీవ్ర ఒత్తిడి తెచ్చినా ఏ మాత్రం తలొగ్గలేదు. ట్రంప్ బెదిరింపులకు వ్యతిరేకంగా ఎక్కువ మంది సభ్యులు ధిక్కరించినట్లు కనిపించింది. సెక్స్ కుంభకోణంలో 1,000 మందికి పైగా బాధితులు ఉన్నట్లు చట్టసభ సభ్యులు అంటున్నారు. 428 మంది సభ్యుల్లో ఒక్కరు మాత్రమే వ్యతిరేక ఓటు వేశాడు. మిగతా వారంతా అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా మిస్టరీగా ఉన్న ఫైళ్లు విడుదలకు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం తెల్పడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చట్టసభ ఆమోదించిన బిల్లును ప్రస్తుతం ట్రంప్ దగ్గరకు పంపించారు. బిల్లుపై సంతకం చేస్తారా? లేదా? అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి: Operation Sindoor: ఇది భారత్ దెబ్బ.. 6 నెలలైనా కోలుకోలేని పాకిస్తాన్..
జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని.. మైనర్ బాలికలు సరఫరా చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందించారు. మంగళవారం వైట్‌హౌస్‌లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో సమావేశం అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఎప్‌స్టీన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అతడొక అనారోగ్యకరమైన వక్రబుద్ధి గల వ్యక్తి అని పేర్కొన్నారు. చాలా సంవత్సరాల క్రితమే తన క్లబ్ నుంచి బయటకు పంపినట్లు చెప్పారు. ఫైళ్లు బయటకు వస్తే డెమోక్రాట్ల నాయకుల బండారం బయటపడుతుందని వ్యాఖ్యానించారు.
ఆరోపణలు ఇవే..
జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన పత్రాల్లో అమెరికాకు చెందిన చాలా మంది పెద్ద వ్యక్తుల పేర్లు ఉన్నాయి. జెఫ్రీ లైంగిక దోపిడీకి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. లైంగిక సంబంధాల కోసం 2002- 2005 మధ్య ఫ్లోరిడాలోని తన ఇంటికి మహిళలను ఆహ్వానించి.. వారికి డబ్బు ఎరవేసి లైంగిక దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం కేసులో 2019లో జెఫ్రీ ఎప్‌స్టీన్ జైలు శిక్ష అనుభవించిన ఒక నెల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
గతంలో కోర్టులో విడుదలైన కొన్నింటిలో మొత్తం 90 మంది పేర్లు ఉన్నాయి. వీరంతా జెఫ్రీకి సన్నిహితులే. ఈ పత్రంలో హార్వర్డ్ యూనివర్సిటీ మాజీ న్యాయ ప్రొఫెసర్ అలాన్ డెర్షోవిట్జ్‌పై ఆరోపణలు ఉన్నాయి. మైనర్ బాలికలతో అలాన్ చాలాసార్లు లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడని ఆ పత్రం ఆరోపించింది. బ్రిటన్ యువరాజు ఆండ్రూ, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ పేర్లు కూడా ఈ పత్రంలో ఉన్నాయి. ఈ పత్రాల్లో జెఫ్రీ, అతని సహచరులు లైంగిక వేధింపులకు గురైన డజన్ల కొద్దీ బాలికల వాంగ్మూలాలు ఉన్నాయి.
అమెరికా కోర్టులో సమర్పించిన పత్రంలో జోహన్నా సోబర్గ్ అనే మహిళ వాంగ్మూలం నమోదు చేయబడింది. 20 ఏళ్ల వయసులో ఆమెను జెఫ్రీ మసాజ్ థెరపిస్ట్‌గా నియమించుకున్నారు. బిల్ క్లింటన్ వయోజన అమ్మాయిలను ఇష్టపడతారని జెఫ్రీ ఒకసారి తనతో చెప్పారని జోహన్నా ప్రకటనలో తెలిపారు. చాలా మసాజ్‌లలో తన శరీరంపై ఎటువంటి బట్టలు లేకుండా సేవలు అందించాల్సి వచ్చేదని.. కొన్నిసార్లు లైంగిక చర్యలో పాల్గొన్నట్లు జోహన్నా తెలిపింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ ఐకాన్ మైఖేల్ జాక్సన్, బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా తదితరుల పేర్లు పత్రాల్లో ఉన్నాయి. ఎప్‌స్టీన్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, బిలియనీర్లు, అకాడెమిక్ స్టార్స్‌తో కూడా అనుబంధం కలిగి ఉన్నాడు. డాక్యుమెంట్లలో మైఖెల్ జాక్సన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా దాదాపు 200 మంది ప్రముఖుల పేర్లు ఉండటం గమనార్హం. క్లింటన్‌కు వ్యతిరేకంగా ఎటువంటి తప్పులు రుజువు కానప్పటికీ.. ఆండ్రూ గతంలో ఎప్‌స్టీన్‌తో కలిసి ప్రయాణించిన 17 ఏళ్ల అమ్మాయితో లైంగిక సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆండ్రూపై ఆరోపణలు రావడంతో ఇంట్లో నుంచి బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ఇప్పటికే బయటకు గెంటేశారు.