ఉషా వాన్స్ అమెరికా సెకండ్ లేడీ. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్టుగా.. సుఖ సంతోషాలతో సంసారం సాఫీగా సాగిపోతుంది. అయితే అక్టోబర్‌లో జేడీ వాన్స్ చేసిన ప్రకటన తర్వాత కాపురంలో ఏదో జరుగుతోందని చర్చ నడిచింది. తన భార్య హిందువు అని.. ఇంకా క్రైస్తవ్యంలోకి రాలేదని.. ఏదొక రోజు మారుతుందని ఆశిస్తున్నట్లు జేడీ వాన్స్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇటీవల హత్యకు గురైన చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్‌ను చాలా గట్టిగా కౌంగిలించుకోవడం.. అలాగే తన భర్తను జేడీ వాన్స్‌లో చూసుకుంటున్నానని ఎరికా కిర్క్ అనడం కొత్త చర్చకు దారి తీసింది. జేడీ వాన్స్-ఉషా వాన్స్ విడిపోతున్నారంటూ పెద్ద ఎత్తున పుకార్లు వినిపించాయి. తాజాగా అందుకు బలం చేకూర్చేలా ఉషా వాన్స్ కూడా పెళ్లి ఉంగరం లేకుండానే ఈవెంట్‌కు హాజరయ్యారు. దీంతో మరోసారి సోషల్ మీడియా వేదికగా పుకార్లు మొదలయ్యాయి.
ఇది కూాడా చదవండి: Supreme Court : నేడు సీజేఐగా సూర్య కాంత్ ప్రమాణస్వీకారం
నవంబర్ 19న నార్త్ కరోలినాలోని క్యాంప్ లెజ్యూన్‌లో వేడుక జరిగింది. ఈ వేడుకకు పెళ్లి ఉంగరం లేకుండానే ఉషా వాన్స్ హాజరయ్యారు. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో కలిసి ఉన్న ఫొటోల్లో చేతికి ఉంగరం లేకుండానే ఉష కనిపించారు. దీంతో మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. జేడీ వాన్స్-ఉషా వాన్స్ విడిపోతున్నారంటూ రకరకాలైన వదంతులు వ్యాప్తి అవుతున్నాయి.
అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న పుకార్లను ఉష సన్నిహితులు తోసిపుచ్చారు. ఇంట్లో వంటలు చేసే సమయంలోనూ.. లేదంటే స్నానం చేసే సమయంలో కొన్నిసార్లు పక్కన పెట్టి మరిచిపోతూ ఉంటారని ఉష బృందానికి చెందిన ఒక ప్రతినిధి అన్నారు.
ఇది కూాడా చదవండి: Spirit : స్పిరిట్ లో రవితేజ కొడుకు, త్రివిక్రమ్ కొడుకు..
గత నెలలో ఎరికి కిర్క్ ఆధ్వర్యంలో మిస్సిస్సిప్పి విశ్వవిద్యాలయంలో యూఎస్ టర్నింగ్ పాయింట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జేడీ వాన్స్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్-ఎరికా కిర్క్ చాలా దగ్గరగా గట్టిగా కౌగిలించుకున్నారు. అంతేకాకుండా జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తన భార్య హిందువు అని.. ఇంకా క్రైస్తవ్యంలో రాలేదని.. తన పిల్లలు మాత్రం క్రైస్తవ్యంలోనే పెరుగుతున్నారని.. తన భార్య కూడా ఏదొక రోజు మారుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎరికా కిర్క్ కూడా మాట్లాడుతూ తన భర్తను జేడీ వాన్స్‌లో చూసుకుంటున్నట్లు తెలిపింది. ఇరువురి వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. జేడీ వాన్స్-ఉషా వాన్స్ విడిపోతున్నట్లు పుకార్లు వ్యాపించాయి. అందుకు బలం చేకూర్చేలా తాజాగా ఉషా వాన్స్ పెళ్లి ఉంగరం లేకుండా కనిపించడంతో మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

JD Vance’s wife is no longer wearing her wedding ring and appears much happier. pic.twitter.com/LNO9CSuvfR
— Anonymous (@YourAnonCentral) November 21, 2025