ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఒక విధ్వంసకర చర్య అని మస్క్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో అమెరికాలోని పరిశ్రమలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆరోపించారు. మరో పోస్టులో ఈ బిల్లు రిపబ్లికన్ల యొక్క రాజకీయ ఆత్మహత్యగా పేర్కొంటూ నిర్వహించిన పోల్‌ను ప్రస్తావించారు. ఇది రుణ పరిమితిని 5 ట్రిలియన్ డాలర్లకు పెంచుతుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవిలో ఉండటం చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Elon Musk: అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందనే వాదనను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీవ్రంగా ఖండించారు. ధనిక దేశాలైన అమెరికా, జపాన్, ఇటలీలో జననాల సంఖ్య తగ్గుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలను తాజాగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తోసిపుచ్చారు. అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి సమావేశం అయ్యే ఆలోచన మాకు లేదని వెల్లడించారు.
భారత దేశంతో చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతం ఇచ్చారు. వైట్ హౌస్‌లో జరిగిన ‘‘బిగ్ బ్యూటిఫుల్ ఈవెంట్’’లో ట్రంప్ ప్రసంగించారు.
Iran: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత తొలిసారిగా ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. సంఘర్షణ తర్వాత తన తొలి బహిరంగ ప్రసంగంలో ఖమేనీ గురువారం మాట్లాడుతూ.. ఇజ్రాయిల్‌పై తాము విజయం సాధించామని, ఇజ్రాయిల్‌ని కాపాడాలని అండగా వచ్చిన అమెరికా ముఖంపై చెంప దెబ్బ కొట్టామని అన్నారు. ఇరాన్ అణు స్థావరాలకు పెద్దగా నష్టం జరగలేదని, అమెరికా పెద్దగా ఏం సాధించలేకపోయిందని చెప్పారు.
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. మెక్సికోలో జరుగుతున్న వేడుకలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. 12 మంది చనిపోగా.. మరో 20 మంది గాయపడ్డారు. దీంతో ఉత్సాహంగా జరుగుతున్న వేడుకలు.. ఒక్కసారిగా విషాదంగా మారాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ మేరకు ట్రంప్ ప్రకటించారు. అనంతరం ఇజ్రాయెల్, ఇరాన్ కూడా ధృవీకరించాయి. అయితే తాజాగా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్ మండిపడింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 24 గంటల్లో దశల వారీగా కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ప్రకటించారు.