అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. శ్వేతసౌధం సమీపంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పోలీస్ అధికారి సహా పలువురికి బుల్లెట్లు తగిలాయి. అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ డీసీ 14 అండ్ యూ వీధిలోని జునెటీంత్ మ్యూజిక్ కన్సెర్ట్ సమీపంలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఫైరింగ్‌లో ఒకరు మృతిచెందగా.. పోలీస్ అధికారి సహా పలువురికి తూటాలు తగిలినట్లు మెట్రోపోలిటన్ పోలీస్ విభాగం తెలిపింది. ఈ ఘటన అధ్యక్ష భవనమైన శ్వేత సౌధానికి సమీపంలోనే…
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైకిల్‌పై నుంచి కింద పడ్డారు. అయితే వెంటనే పైకి లేచిన ఆయన తాను బాగానే ఉన్నట్లు తెలిపారు. కాగా, బైడెన్‌కు ఎలాంటి దెబ్బలు తగలలేదని వైట్‌హౌస్ పేర్కొంది. జో బైడెన్ తన భార్య జిల్ బైడెన్‌తో కలిసి డెలావేర్‌లోని తమ ఇంటికి సమీపంలోని రెహోబోత్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఐతే అధ్యక్షుడు బైడెన్ శనివారం సైకిల్ పై సరదాగా రైడింగ్‌కి వెళ్లారు. అనుకోకుండా హఠాత్తుగా సైకిల్ మీద నుంచి దిగుతూ బ్యాలెన్స్…
ఆరు నెలల పసికందు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకా విషయంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలల వయసున్న చిన్నారులకూ ఫైజర్, మోడర్నా కంపెనీల కరోనా టీకాలు వేసేందుకు తాజాగా అనుమతిచ్చింది. ఆరు నెలల నుంచి ఐదేళ్ల పిల్లలకు రెండు డోసులు వేయడానికి మోడెర్నాకు, ఆరు నెలల నుంచి నాలుగేళ్ల పిల్లలకు మూడు డోసులు వేసేలా ఫైజర్‌కు అత్యవసర అనుమతులకు శుక్రవారం ఆమోదం లభించింది. . టీకాలు ఎలా ఇవ్వాలన్న దానిపై…
అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల టెక్సాస్‌లో ఓ స్కూల్లోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో టీచర్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా న్యూయార్క్, ఉవాల్డే, టెక్సాస్ నగరాల్లోనూ కాల్పులు జరిగాయి. తాజాగా గురువారం సాయంత్రం అలబామాలోని ఓ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడిని…
అమెరికాకు సమస్య వస్తే ప్రపంచానికి సంక్షోభమే..2008లో జరిగింది ఇదే.. ఇప్పుడు జరుగుతున్నదీ అదే.. అమెరికా ద్రవ్యోల్బణం 40ఏళ్ల గరిష్టానికి పెరిగింది.దాన్ని కంట్రోల్ చేయటానికి తీసుకుంటున్న చర్యలు ప్రపంచ దేశాలను సంక్షోభం ముంగిట నిలుపుతున్నాయి..కరోనా కష్టాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా మాద్యం అన్నీ కలిసి ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయా? ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రణాళికలు వేసినా అది ఆర్తిక పరిస్థితి బాగున్నంత వరకే..జేబు నిండుగా ఉంటే, ఆ డబ్బుకి విలువ ఉంటే లోకమంతా…
భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరుందో మరోసారి రుజువైంది. అమెరికాలోని మన భారతీయ రెస్టారెంట్ ‘ఉత్తమ రెస్టారెంట్’గా ఎంపికైంది. నార్త్ కరోలినాలోని డౌన్ టౌన్ యాష్ విల్లేలో ఈ రెస్టారెంట్ ఉంది. దీన్ని 2009లో ప్రారంభించారు. భారతీయ స్నాక్స్‌ను ఈ రెస్టారెంట్ అందుబాటు ధరల్లోనే అందించడం ప్రత్యేకత. చికాగోలో సోమవారం జరిగిన జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో.. అమెరికాలోనే అత్యుత్తమ రెస్టారెంట్‌గా చాయ్ పానీని ఎంపిక చేశారు. న్యూ ఓర్లాన్స్కు చెందిన బ్రెన్నాన్‌ను వెనక్కి…
తైవాన్ విషయంలో తాము యుద్ధానికి కూడా సిద్ధమని చైనా స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. చైనా తైవాన్ను తన భూభాగంగా భావించడమే కాకుండా ఏదో ఒకరోజు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. తైవాన్‌కు స్వాతంత్య్రం కావాలని ప్రకటిస్తే.. యుద్ధం ప్రారంభించడానికి ఏ మాత్రం వెనుకాడబోమని చైనా తేల్చిచెప్పింది. సింగపూర్ వేదికగా జరిగిన సమావేశంలో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు చైనా రక్షణ మంత్రి వీఫెంగ్ తైవాన్ను…
అమెరికాలోని శ్రీవారి భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమెరికాలో వున్న తెలుగు వారి కోసం ఈ నెల 18 వ తేదీ నుంచి జూలై 9తేది వరకు కళ్యాణోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 7 నగరాలలో కళ్యాణోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. నాటా ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ కార్యక్రమాలకు భక్తులను ఉచితంగా అనుమతిస్తాం అనీ, భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని భావిస్తున్నామన్నారు. కళ్యాణోత్సవ కార్యక్రమాలకు విగ్రహాలను తిరుమల…
అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి కాల్పుల మోత మోగింది. యూఎస్ టెక్సాస్ ఘటన మరువక ముందే.. పశ్చిమ మేరీ ల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కొలంబియా మెషిన్ ఫ్యాక్టరీలోకి చొరబడ్డ ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారని యూఎస్ మీడియా వెల్లడించింది. మేరీల్యాండ్‌లోని స్మిత్స్‌బర్గ్‌లో కొలంబియా మెషీన్ అనే మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు…
క్యాన్సర్ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు. క్యాన్సర్‌ను నయం చేసే నిఖార్సైన మందు లేకపోవడమే దీనికి కారణమన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే క్యాన్సర్ మహమ్మారికి ఇక రోజులు దగ్గరపడినట్లే అనిపిస్తోంది. చరిత్రలోనే తొలిసారిగా క్లినికల్ ట్రయల్‌లో భాగంగా ఒక గర్భాశయ క్యాన్సర్ ఔషధం చూపిన ఫలితం వైద్యులను ఆశ్చర్యపరుస్తోంది. అత్యంత ప్రమాదకరమైన పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న కొంత మంది క్యాన్సర్ పేషెంట్లకు క్లినికల్ ట్రయల్‌లో భాగంగా డోస్టార్లిమాబ్ అనే ఔషధాన్ని సైంటిస్టులు…