ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. ఇంకా కరోనా సమస్య తొలగిపోకముందే ఈ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో రోజురోజుకూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రపంచదేశాలను వణికిస్తున్న మంకీపాక్స్పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
అమెరికా సెనెట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ను సందర్శించడం వల్ల చైనాతో యుద్ధానికి దారితీస్తుందని రష్యా అమెరికాను హెచ్చరించింది. అయితే పెలోసి ఇంకా ద్వీపాన్ని సందర్శించడానికి సిద్ధంగా ఉన్నారని పలు వర్గాలు వెల్లడించాయి.
ఎప్పుడూ యుద్ధం గురించి వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి అమెరికాతో కయ్యానికి కాలు దువ్వే విధంగా ఆయన మాట్లాడారు. కిమ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే ఉత్తర కొరియా మరోసారి ప్రపంచానికి సవాల్ విసరనుందన్న భావన కలుగుతోంది. తమకు అమెరికా, దక్షిణ కొరియా దేశాల నుంచి ముప్పు ఉందని, తాము ఆత్మరక్షణ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కిమ్ అన్నారు.
Monkeypox cases in world: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టకముందే.. మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. బ్రిటన్ లో ప్రారంభం అయిన ఈ కేసులు నెమ్మదిగా యూరప్ లోని అన్ని దేశాలకు వ్యాపించాయి. ఇక అమెరికాలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇక భారత్ లో కూడా మొత్తం 4 కేసులు నమోదు…
అమెరికాలో కరోనా వైరస్తో బాధపడుతోన్న ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోన్న రెండు వైరస్లు ఒకేసారి ఒకే వ్యక్తికి సోకడం తొలిసారి అని అగ్రరాజ్యం అధికారులు తెలిపారు.
అమెరికాలో మంకీపాక్స్ వ్యాధిని మొదటిసారిగా పిల్లల్లో గుర్తించారు. కాలిఫోర్నియాలోని ఇద్దరు పసిపిల్లలకు మంకీపాక్స్ సోకిందని యూఎస్ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈ రెండు మంకీపాక్స్ కేసులు గృహ ప్రసారం ఫలితంగా ప్రబలి ఉండవచ్చని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికాలో మరోసారి పోలియో వైరస్ కేసు నమోదైంది. గురువారం మాన్హాటన్ సమీపంలోని ఓ వ్యక్తికి ఈ వైరస్ ఉన్నట్టు న్యూయార్క్ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెరికాలో చివరిసారి 2013లో పోలియో వైరస్ కేసు నమోదైంది. సుమారు దశాబ్దకాలం తర్వాత అమెరాకిలో గురువారం తొలిసారి పోలియో వైరస్ కేసు రిపోర్ట్ కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెలితే.. ఉత్తర మాన్హటాన్కు 30 మైళ్ల దూరంలో రాక్లాండ్ కౌంటీలో జీవిస్తున్న ఓ వ్యక్తికి పోలియో పాజిటివ్ అని…
US President Joe Biden tests positive for COVID-19: రెండున్నర సంవత్సరాలుగా ప్రపంచాన్ని కరోనా బాధిస్తోంది. అనేక రూపాలను మారుస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్, ఓమిక్రాన్ సబ్ వేరియంట్ల రూపంలో ప్రజలను పట్టిపీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 65 కోట్లను దాటింది. ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రెజిల్, జర్మనీ, ఇండియా, చైనా వంటి దేశాలు ఇప్పటికే కరోనాతో బాధపడుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్లు వచ్చినా కూడా కరోనా మహమ్మారికి పూర్తిగా అడ్డుకట్ట…
అమెరికాలోని అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్లలో ఒకటైన హూవర్ డ్యామ్ వద్ద మంగళవారం ఒక ట్రాన్స్ఫార్మర్ పేలింది. ఈ పేలుడులో మంటలతో కూడిన నల్లటి పొగ భారీ ఎత్తున ఎగిసిపిడింది.