America: మంచు గుప్పిట్లో అగ్రరాజ్యం.. 1500కు పైగా విమానాలు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America: శక్తివంతమైన శీతాకాలపు తుఫానులు బుధవారం అమెరికాను తాకాయి. అగ్రరాజ్యం అమెరికా మరోసారి శీతాకాలపు మంచుతుపాను గుప్పిట్లో చిక్కుకుంది. మంచు తుఫానులు వెస్ట్ కోస్ట్ నుంచి గ్రేట్ లేక్స్ వరకు భారీగా రెండు అడుగుల (60 సెం.మీ.) వరకు మంచు కురుస్తోంది. ఈ నేపథ్యంలో వేలాది ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. లాస్ఏంజెల్స్ సమీపంలో సాధారణంగా వెచ్చగా ఉండే ప్రాంతాలకు భారీ హిమపాతం హెచ్చరికలు జారీ అయ్యాయి. మిన్నెసోటాలో పరిస్థితులు తీవ్రమయ్యే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 55 నుంచి 70 కిలోమీటర్లతో వీచే గాలులతో కలిపి భారీగా మంచు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రహదారులపై ప్రయాణించాల్సి వస్తే తప్పనిసరిగా సేఫ్టీ కిట్‌ను వెంట ఉంచుకోవాలని సూచించింది. “తప్పనిసరిగా ప్రయాణించవలసి వస్తే, అత్యవసర పరిస్థితుల్లో మీ వాహనంలో అదనపు ఫ్లాష్‌లైట్, ఆహారం, నీరు ఉంచండి. ప్రయాణం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలి. మీరు తప్పనిసరిగా ప్రయాణించవలసి వస్తే, మీతో శీతాకాలపు మనుగడ కిట్‌ని కలిగి ఉండండి. మీరు ఒంటరిగా ఉంటే, మీ వాహనంతో ఉండండి.” అని సూచించింది.
Read Also: Pakistan: పాకిస్తాన్‌కు మోదీ కావాలి.. నవాజ్, ఇమ్రాన్ వద్దు.. వైరల్ అవుతున్న వీడియో..
Also Read
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
డెన్వర్, సాల్ట్ లేక్ సిటీ. మిన్నియాపాలిస్, సెయింట్ పాల్, వ్యోమింగ్‌లలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో గురువారం ఉదయం నాటికి 1500కు పైగా విమానాలు రద్దయ్యాయి. వ్యోమింగ్‌లో ప్రధాన రహదారులపై కూడా అడుగుల మేర మంచు ఉండడంతో ప్రయాణాలు సాగించడం చాలా ప్రమాదకరంగా మారింది. “మీరు వ్యోమింగ్ వైపు వస్తున్నట్లయితే దయచేసి ప్రయాణ ప్రణాళికలను మార్చుకోండి” అని రాష్ట్ర రవాణా శాఖ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. వ్యోమింగ్ అంతటా రహదారులపై మంచు ఉండడంతో చాలా రోజుల పాటు ఆ రహదారులను మూసే అవకాశం కూడా ఉంది. దాదాపు 2.80 లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయాయి. వాటిలో దాదాపు సగం మిచిగాన్‌లోనే ఉండడం గమనార్హం. ప్రమాదకర శీతాకాలపు తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని లాస్ ఏంజిల్స్‌లోని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలా ఒకవైపు అమెరికా పశ్చిమ, ఉత్తర ప్రాంతాలు చలితో వణుకుతుంటే.. తూర్పు ప్రాంతాల్లో అసాధారణ ఉష్ణోగత్రలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఒహైయో వ్యాలీ, మధ్య అట్లాంటిక్‌లలో సగటు కంటే 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జాతీయ వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజావార్తలు
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!