Russia: ఉక్రెయిన్‌పై దాడికి ఏడాది కావొస్తున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. అణ్వాయుధ వినియోగంపై పరిమితి విధిస్తూ అగ్రరాజ్యంతో చేసుకున్న ఒప్పందంలో రష్యా భాగస్వామ్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఇరుపక్షాల వ్యూహాత్మక అణ్వాయుధాలను పరిమితం చేసే అమెరికాతో న్యూ స్టార్ట్ ఒప్పందంలో రష్యా తన భాగస్వామ్యాన్ని నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెలిపారు. “అమెరికాతో రష్యా వ్యూహాత్మక ప్రమాదకర ఆయుధాల ఒప్పందంలో తన భాగస్వామ్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేను ఈరోజు ప్రకటించవలసి వచ్చింది” అని ఉక్రెయిన్‌లో యుద్ధానికి దాదాపు ఒక సంవత్సరం పాటు పార్లమెంటులో ప్రధాన ప్రసంగం ముగింపులో పుతిన్ చట్టసభ సభ్యులతో అన్నారు. . అయితే ఒప్పందం నుంచి ఇప్పుడే పూర్తిగా బయటకు రావట్లేదని పుతిన్ చెప్పడం గమనార్హం.
ఉక్రెయిన్‌లో రష్యాను ఓడించాలన్న లక్ష్యాన్ని అమెరికా, నాటో దేశాలు బహిరంగంగానే ప్రకటిస్తున్నాయని, వ్యూహాత్మకంగా మమ్మల్ని ఓడించి.. మా అణు కేంద్రాలను చేరుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారని పుతిన్ చెప్పారు. ఒప్పందం ప్రకారం రష్యా అణ్వాయుధ సామర్థ్యాలపై అమెరికా తనిఖీలు చేస్తోందన్నారు. అదే సమయంలో నాటో దేశాలు మా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసేందుకు సాయం చేస్తున్నాయని ఆయన ప్రసంగంలో తెలిపారు. అమెరికా ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే అణ్వాయుధ ప్రయోగాలను పునరుద్ధరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు ఒప్పందంపై తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
Read Also: Pak University Exam: యూనివర్సిటీ పరీక్షలో బూతు ప్రశ్న.. అన్నాచెల్లి మధ్య లింక్!
వాస్తవానికి ఈ న్యూ స్టార్ట్ ట్రిటీ ఒప్పందంపై 2010లో ఇరు దేశాలు సంతకం చేశాయి. ఆ తర్వాత ఏడాదే ఇది అమల్లులోకి వచ్చింది. మళ్లీ 2021లో జో బైడెన్ పదవీ భాద్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఒప్పందం మరో ఐదేళ్ల పాటు పొడిగించడం జరిగింది. ఇది అమెరికా రష్యా వ్యూహాత్మక అణు వార్‌హెడ్‌లను సంఖ్యను పరిమితం చేసేలా, భూమి, జలాంతర్గామీ ఆధారిత క్షిపణులు, బాంబులను మరింతగా విస్తరింప చేస్తోంది. పుణుల అభిప్రాయం ప్రకారం..రష్యా వద్ద దాదాపు 6 వేల వార్‌హెడ్‌లతో ప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధాల నిల్వ ఉన్నట్లు సమాచారం. అంతేగాదు రష్యా, అమెరికాలే వద్ద ప్రపంచంలోని 90శాతం అణు వార్‌హెడ్‌లను కలిగి ఉన్నాయని, ఇవి ఒక గ్రహాన్ని పూర్తిగా నాశనం చేయగలవని చెబుతున్నారు. 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ మధ్య న్యూ స్టార్ట్ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. ఇరు దేశాలు 1550 కంటే ఎక్కువ న్యూక్లియర్ వార్‌హెడ్‌లు, 700 కంటే ఎక్కువ క్షిపణులు, బాంబర్లను మోహరించకూడదు. 2021 ఫిబ్రవరి నాటికి ఈ ఒప్పందం గడువు ముగియగా.. దీన్ని మరో ఐదేళ్లు పొడగించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం కింద ఇరు దేశాలు పరస్పరం తనిఖీలు చేసుకుంటాయి. అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఈ తనిఖీలను నిలిపివేశారు. ఇటీవల అమెరికా ఈ తనిఖీలను పునరుద్ధరించాలని ప్రయత్నించగా.. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా తిరస్కరిస్తూ వస్తోంది. తాజాగా ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు.
ఉక్రెయిన్‌పై దాడికి ఏడాది కావొస్తున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో రష్యన్ స్టేట్ మీడియా వెబ్‌సైట్లు డౌన్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు పాత్రికేయులు రష్యా స్టేట్ టెలివిజన్ అండ్ రేడియో బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ వెబ్‌సైట్ సేవలను పొందలేకపోయారు. దీనిపై ఆ కంపెనీ స్పందించింది. సాంకేతిక పరంగా కొన్ని పనులు చేపడుతున్నామని వెల్లడించింది.