Andhra Pradesh: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఇటీవల విశాఖలో మంత్రులపై దాడి ఘటన ఏపీలో పెనుదుమారం రేపింది. అయితే తాజాగా తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలోని మంత్రులు, పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని అధికార పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. అర్జీలు ఇచ్చే సాకుతో జనసేన కార్యకర్తలు దాడులు చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ విభాగం వార్నింగ్ ఇచ్చింది. టెక్కలిలో జనసేన కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి అలర్ట్ కావాలంటూ ఇంటెలిజెన్స్ హితవు పలికింది. స్థానికంగా కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో సర్కులేట్ అవుతోన్న అంశాలతో ఇంటెలిజెన్స్ వర్గాలు మంత్రులు, ఎమ్మెల్యేలను అప్రమత్తం చేశాయి.
Read Also: TOSS : విద్యార్థులకు శుభవార్త.. ఓపెన్ స్కూల్ అడ్మిషన్ డ్రైవ్
Also Read
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల జాబితాలో మంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి అంబటి రాంబాబు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి రోజా, మంత్రి దాడిశెట్టి రాజా. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్, అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్, జక్కంపూడి రాజా, పేర్ని నాని, కొడాలి నాని ఉన్నట్లు తెలుస్తోంది. కాగా చెప్పు చూపించి బయటపెడతామంటే ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని పవన్‌ను ఉద్దేశించి మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడు అయినా ఎదుటివారికి గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని సూచించారు. అగౌరవంగా మాట్లాడితే సహించేదిలేదని మంత్రి బొత్స వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
-
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!