గోపీచంద్, నయనతార జంటగా నటించిన ‘ఆరడగుల బుల్లెట్’ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదలైంది. అయితే ఆశించిన రీతిలో ఈ సినిమా ఫలితం సాధించడంలో విఫలమైంది. తాజాగా ఈ మూవీలో ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఆయన మార్కు కత్తులు, వ్యాన్లు గాల్లోకి ఎగరడం అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి.…
ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే పవన్ నటించిన వకీల్ సాబ్ మూవీ విడుదల కాగా మరోవైపు ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. అందులో ‘భీమ్లానాయక్’ సినిమా ఒకటి. మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను తెలుగులో ‘భీమ్లానాయక్’గా రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీకి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు.…
అమెజాన్ ప్రైమ్ తమ యూజర్లకు బ్యాడ్‌న్యూస్ అందించింది. కొత్త సినిమాలను, వెబ్ సిరీస్‌లను అందించే అమెజాన్ ప్రైమ్ ఇకపై ప్రియం కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వార్షిక సబ్స్క్రిప్షన్ ధరలు 50 శాతం పెరగనున్నాయి. దీంతో ఇప్పటివరకు వార్షిక ఫీజు రూ.999 చెల్లిస్తే సరిపోయేది. అయితే ఇకపై రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు నెలవారీ, మూడు నెలల ప్లాన్లను కూడా అమెజాన్ ప్రైమ్ పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెలవారీ ప్లాన్ రూ.129 ఉండగా ఇకపై రూ.179 చెల్లించాలి.…
తమిళ్ అగ్ర హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జైభీమ్’. ఈ మూవీ ట్రైలర్ విడుదలకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. అక్టోబర్ 22న జై భీమ్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వెంకటేష్ హీరో నటించిన ‘గురు’ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధ కొంగర ఈ మూవీకి డైరెక్టర్. సూర్య హీరోగా ఆమె గతంలో ‘ఆకాశమే నీహద్దురా’ మూవీని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ మూవీ ఓటీటీలో విడుదల కాగా జైభీమ్…
ప్రముఖ నటి జ్యోతిక నాయికగా నటించిన చిత్రం ‘ఉడన్ పిరప్పు’. ఆమెకిది 50వ చిత్రం. 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్య, జ్యోతిక సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎరా. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జ్యోతిక, శశికుమార్, సముతిర ఖని కీలక పాత్రలు పోషించారు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ట్రైలర్ ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ప్రధాన…
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బెల్‌బాటమ్’.. ఆగస్టు 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆకట్టుకొంది.. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 16న స్ట్రీమింగ్కు ఉంచుతున్నట్లు అమెజాన్ ప్రకటించింది. రంజిత్ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రంలో వాణీ కపూర్ కథానాయికగా నటించింది.. ఇందులో అక్షయ్‌కుమార్ అండర్ కవర్ రా ఏజెంట్ ‘బెల్‌బాటమ్’గా కనిపించారు. ఇక బెల్‌బాటమ్ అనేది అక్షయ్‌కుమార్ కోడ్ నేమ్.. లారా దత్తా…
టాలీవుడ్ యంగ్ యాక్టర్ విశ్వక్ సేన్ నటించిన ‘పాగల్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ తేదిని ప్రకటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలవగా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే కరోనా సెకండ్ వేవ్ తరువాత వచ్చిన సినిమా కావడంతో యూత్ ఎక్కువగా సినిమాను వీక్షించారు. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ తో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. లవ్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్…
‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన చిత్రం ‘మెరిసే మెరిసే’. ఈ చిత్రాన్ని కొత్తూరి ఎంటర్ టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. ఈ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆగస్ట్ 6న థియేటర్స్‌లో విడుదలైంది. అయితే చిత్రంగా కేవలం రెండు వారాల్లోనే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకటేశ్ కొత్తూరి మాట్లాడుతూ ”కోవిడ్ సెకండ్ వేవ్…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటిస్తున్న ప్రతి సినిమాను తెలుగులోనూ విడుదల అయ్యేలా చూసుకుంటాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ లో 39వ చిత్రంగా వస్తున్న “జై భీమ్” సినిమాను ఓటీటీలోనే విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ తెలియజేశారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సూర్య గిరిజన సంఘాల హక్కుల కోసం, వారి భూమి కోసం…
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ…