75 HP పవర్, 750సీసీ లైనప్, 730సీసీ ట్విన్ ఇంజిన్‌తో Jawa 730 Twin త్వరలోనే లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jawa 730 Twin: ప్రముఖ చెక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ జావా (Jawa) తన తాజా మోడల్ 730 ట్విన్ (730 Twin)ను అధికారికంగా ఆవిష్కరించింది. గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకున్న ఈ మోడల్, జావా 750సీసీ లైనప్‌లో రెట్రో, రేసర్, టూరర్ వేరియంట్ల సరసన నిలుస్తూ బ్రాండ్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తోంది. భారతదేశంలో జావా బ్రాండ్‌ను నిర్వహిస్తున్న క్లాసిక్ లెజెండ్స్ పర్యవేక్షణలో ఈ మోడల్ రూపుదిద్దుకుంది.
Read Also: Comet: అంతరిక్షంలో మళ్లీ తిరిగి రాని అద్భుతం.. ఇప్పుడు కాకుంటే ఎప్పుడూ చూడలేరు..
Also Read
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ఇంజిన్ & పనితీరు:
జావా 730 ట్విన్‌లో 730సీసీ లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ని జోడించారు. ఈ ఇంజిన్‌ను స్విస్ ఇంజినీరింగ్ దిగ్గజం సూటర్ (Suter)తో కలిసి అభివృద్ధి చేశారు. 2010 నుంచి 2012 వరకు మోటో2 ఛాంపియన్‌షిప్‌లో ఆధిపత్యం చెలాయించిన సంస్థ ఇదే కావడం విశేషం. ఈ పవర్ యూనిట్ 8,200 ఆర్పీఎమ్ దగ్గర 75 హెచ్‌పీ పవర్, 7,100 ఆర్పీఎమ్ వద్ద 68 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. నగర ప్రయాణాలు, వంకర తిరిగిన రోడ్లపై రైడింగ్‌కు అనువైన మృదువైన పవర్ డెలివరీతో పాటు ఉత్సాహభరితమైన యాక్సిలరేషన్‌ను అందజేస్తుంది.
కేఫ్ రేసర్ స్టైలింగ్:
730 ట్విన్‌ను కేఫ్ రేసర్ శైలిలో డిజైన్ రూపొందించారు. ముందు భాగంలో బోల్డ్ రేక్-అవుట్ డిజైన్, రౌండ్ హెడ్‌ల్యాంప్ జావా క్లాసిక్ మోడల్స్ ని గుర్తుకు తెస్తాయి. సింగిల్-సీట్ సెటప్‌తో ఇంటిగ్రేటెడ్ టెయిల్ ల్యాంప్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది, స్వింగ్‌ఆర్మ్‌కు అమర్చిన నంబర్ ప్లేట్ బైక్‌కు అగ్రెసివ్ లుక్‌ను ఇస్తోంది. సంప్రదాయ డిజైన్‌కు ఆధునిక టచ్ జోడించినట్లు ఈ మోడల్ కనపడుతుంది.
Read Also: Vellampalli Srinivas: లడ్డూలో ఫ్యాట్ ఉందని నిరూపిస్తారా.. కూటమి నేతలకు వెల్లంపల్లి ఛాలెంజ్..
హార్డ్‌వేర్ & ఫీచర్లు:
సస్పెన్షన్ కోసం ముందు భాగంలో కేవైబీ (KYB) యూఎస్‌డీ ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ జోడించారు. ఇవి కార్నర్ కట్టింగ్ నుంచి హైవే క్రూయిజింగ్ వరకు స్థిరమైన హ్యాండ్లింగ్‌ను అందిస్తాయి. అలాగే, బ్రేకింగ్ సిస్టమ్‌లో ముందు భాగంలో బ్రెంబో ట్విన్ కాలిపర్లు, 17 అంగుళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి.. టెక్నాలజీ పరంగా టీఎఫ్‌టీ డిస్‌ప్లే, నావిగేషన్, కనెక్టివిటీ, కాల్ అలర్ట్స్, ఎస్‌ఎంఎస్ నోటిఫికేషన్లు వంటి ఆధునిక ఫీచర్లను అందించారు.
లాంచ్ వివరాలు:
జావా 730 ట్విన్‌ను వచ్చే నెల చెక్ రిపబ్లిక్‌లోని బ్ర్నోలో జరగనున్న మోటోసాలోన్ ట్రేడ్ ఫెయిర్లో అధికారికంగా ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ మోడల్ ప్రధానంగా యూరోపియన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. భారతదేశంలో అందుబాటులో ఉన్న జావా 42, జావా 350, పెరాక్ లాంటి మోడళ్లకు ఇది భిన్నం.. ప్రస్తుతం భారత మార్కెట్‌లో విడుదలపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా, ప్రపంచవ్యాప్తంగా జావా అభిమానులకు ఇది ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు