ప్రముఖ నటి జ్యోతిక నాయికగా నటించిన చిత్రం ‘ఉడన్ పిరప్పు’. ఆమెకిది 50వ చిత్రం. 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్య, జ్యోతిక సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎరా. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జ్యోతిక, శశికుమార్, సముతిర ఖని కీలక పాత్రలు పోషించారు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ట్రైలర్ ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ప్రధాన తారాగణం నటన ఇందులో హైలైట్ గా కనిపిస్తోంది. విశేషం ఏమంటే… జ్యోతిక నటిస్తున్న ఈ సినిమా ఇదే నెల 14న దసరా కానుకగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిని తెలుగులో ‘రక్తసంబంధం’ పేరుతో డబ్ చేస్తున్నారు. సో… ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను చూసి ఆనందించవచ్చు.