ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే పవన్ నటించిన వకీల్ సాబ్ మూవీ విడుదల కాగా మరోవైపు ఒకేసారి నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టారు. అందులో ‘భీమ్లానాయక్’ సినిమా ఒకటి. మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను తెలుగులో ‘భీమ్లానాయక్’గా రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీకి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీని డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తోంది.
Read Also: ‘సర్కారు వారి పాట’ మ్యూజిక్ కంపోజిషన్స్ పూర్తి!
ఈ నేపథ్యంలో ‘భీమ్లానాయక్’ సినిమాకు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నేరుగా ఓటీటీలో విడుదల చేస్తే నిర్మాతలకు అమెజాన్ వారు రూ.150 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. మరి ఈ ఆఫర్‌ను మేకర్స్ ఒప్పుకుంటారో లేదో తెలియాల్సి ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరుపై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా అంతకుముందు పవన్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాకు అమెజాన్ చెల్లించిన మొత్తం రూ.50 కోట్లు మాత్రమే. అయితే ఆ మూవీ థియేటర్లలో విడుదలైన మూడు వారాల అనంతరం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. మరి ‘భీమ్లానాయక్’ను నిర్మాతలు నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తారా లేదా కేవలం పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను మాత్రమే ఇస్తారా అన్నది వేచి చూడాలి.