దృశ్యం-2 ట్రైలర్: సస్పెన్స్ అదిరిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలు పోషించిన ‘దృశ్యం-2’ సినిమా ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. మలయాళం మూవీ దృశ్యం-2 మూవీకి ఇది రీమేక్‌గా తెరకెక్కింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రాగా.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా సస్పెన్స్ అంశాలతో ఆకట్టుకుంటోంది. పోలీస్ ఆఫీసర్ కుమారుడు వరుణ్ హత్య తర్వాత ఏమైందనే కథ చుట్టూ ఈ సినిమాను తెరకెక్కించారు. రాంబాబు సినిమా థియేటర్ కట్టుకుని హాయిగా జీవిస్తున్న తరుణంలో మళ్లీ వరుణ్ హత్యకు సంబంధించిన అంశాలు తెరపైకి వస్తాయి. ఫస్ట్ పార్టులో రాంబాబు దాచిఉంచిన డెడ్ బాడీని సీక్వెల్‌లో బయటకు తీసినట్లు చూపిస్తున్నారు.
Read Also: నాగ చైతన్యపై రివెంజ్.. సమంత మరో సంచలన నిర్ణయం
Also Read
ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నరేష్, నదియా, కృతిక, ఎస్తేర్, సంపత్ రాజ్, వినయ్ వర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళ వెర్షన్ కూడా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలోనే విడుదలవుతోంది. నవంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో దృశ్యం-2 మూవీ స్ట్రీమింగ్ కానుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!