మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు మహాపాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ చేస్తోన్న నవంబర్ 1న ప్రారంభమైంది. అయితే 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పాదయాత్ర డిసెంబర్ 15న తిరుమలకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో నేడు 28 రోజు మహాపాదయాత్రకు బ్రేక్ పడింది.
Also Read : యువతిని మోసం చేసిన ఉగాండా ఉన్మాది.. రఫ్ఫాడించిన పోలీసులు
భారీ వర్షాల దృష్ట్యా పాదయాత్రకు ఈ రోజు విరామం ఇస్తున్నట్లు అమరావతి రైతుల జేఏసీ వెల్లడించింది. ఏపీలో భారీ వర్షాల కారణంగా ఇప్పటికోసారి రెండు రోజులు విరామం ప్రకటించారు రైతులు. అయితే మరోసారి ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరోసారి రాజధాని రైతుల పాదయాత్రకు బ్రేక్ పడింది.