CRDA: నేడు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాదికార సంస్థ (సీఆర్‌డీఏ) కీలక సమావేశం జరగనుంది.. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు సీఆర్డీఏ 45వ సమావేశం జరగనుండగా.. రాజధాని పనులు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నా ఈ అథారిటీ.. సుమారు 40 వేల కోట్ల విలువైన పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలపనుంది సీఆర్డీఏ భేటీ.. ఇక, అథారిటీ ఆమోదం పొందగానే ఆయా ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకోనుంది సీఆర్డీఏ.. రాజధానిలో ఒకేసారి పెద్దయెత్తున పనులు ప్రారంభించబోతున్నాయి ఏజెన్సీలు..
Read Also: Viral Video: జియోమెట్రీ బాక్స్‌తో అద్భుతం సృష్టించిన పిల్లలు
కాగా, అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపుల పై కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. మంత్రులు పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్ తో పాటు మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఇతర అధికారులు హాజరయ్యారు.. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో భూములు కేటాయించిన సంస్థల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.. అమరావతిలో గతంలో 131 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.. వీటిలో 31 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపులు కొనసాగించాలని నిర్ణయించామన్నారు.. మరో రెండు సంస్థలకు గతంలో ఇచ్చిన చోట కాకుండా వేరొక చోట కేటాయింపులు చేస్తూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు.. ఇక 16 సంస్థలకు గతంలో కేటాయింపులు చేసిన విస్తీర్ణంలో మార్పులు చేయడంతో పాటు వేరొక ప్రాంతాల్లో కేటాయింపులు చేస్తున్నామన్నారు.. ఇక 13 సంస్థలకు వివిధ కారణాలతో భూకేటాయింపులు రద్దుకు సబ్ కమిటీ అంగీకారం తెలిపిందని మంత్రి నారాయణ వెల్లడించిన విషయం విదితమే. ఇక, రాజధాని నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి… సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పనులు ప్రారంభం కానుండడగా.. ఈ రోజు జరిగే సీఆర్డీఏ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయానికి రానున్నారు..