AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. అమరావతి రాజధానికి 4285 కోట్ల రూపాయలు విడుదల చేసింది కేంద్రం.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు జరిగినా.. ఆ తర్వాత వైసీపీ సర్కార్ సమయంలో మాత్రం.. వాటి జోలికి పోలేదు ప్రభుత్వం.. మూడు రాజధానులను కూడా తెరపైకి తెచ్చింది.. అయితే, కూటమి ప్రభుత్వం మళ్లీ రాజధానిపై ఫోకస్ పెట్టింది.. నిలిచిపోయిన అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించడానికి సిద్ధమైంది.. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాబోతున్నారు.. ఈ సమయంలో.. అమరావతి రాజధానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.. రాజధాని పనుల కోసం రూ.4285 విడుదల చేసింది.. అమరావతి నిర్మాణంలో తొలిదశ కింద రూ.4285 కోట్ల విడుదల చేసింది ఎన్డీఏ సర్కార్.. ప్రపంచ బ్యాంక్ రుణంలో భాగంగా ఈ నిధుల విడుదలయ్యాయి.. అమరావతి పనుల శ్రీకారానికి ప్రధాని రాక చర్చ సమయంలో నిధుల విడుదల ప్రాధాన్యత సంతరించుకుంది.. కాగా, తొలి దశలో రాజధాని ప్రాంతంలో చేపట్టాల్సిన పనులకు సీఆర్డీఏ అనుమతి ఇవ్వడం.. ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం.. ఆ పనులకు సంబంధించిన టెండర్లకు పిలవడం.. ఇలా అమరావతి రాజధాని నిర్మాణ పనుల విషయంలో ప్రభుత్వం ముందకు సాగుతోన్న విషయం విదితమే..
Read Also: Karnataka Minister: పెద్ద నగరాల్లో లైంగిక దాడులు సహజం..! వివాదంలో మంత్రి..