Allu Arjun New Look: బన్నీ నయా లుక్.. ఫోటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun New Look Going Viral On Social Media: సబ్జెక్ట్‌ల పరంగానే కాదు.. లుక్ పరంగానూ అల్లు అర్జున్ వైవిధ్యం కనబరుస్తాడు. సినిమా సినిమాకి లుక్ మారుస్తూ.. సరికొత్త ట్రెండ్స్‌ని సృష్టిస్తుంటాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో కొత్త లుక్‌లో దర్శనమిచ్చి.. అందరికీ షాకిచ్చాడు బన్నీ. కొద్దిగా నెరసిన గెడ్డం, నోట్లో సిగరేట్, బ్లాక్ గాగుల్స్, చెవికి పోగు పెట్టి.. రఫ్ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించాడు. అంతకుముందే ప్రీ-లుక్స్ బయటకు రాగా.. తాజాగా ఫుల్ లుక్ వచ్చేసింది.
అయితే.. ఈ నయా లుక్ సినిమా కోసం కాదు. ఓ యాడ్ షూటింగ్ కోసం బన్నీ ఇలా కొత్త అవతారం ఎత్తాడు. ఈమధ్యే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ యాడ్ చిత్రీకరణలో పాల్గొన్న బన్నీ.. తాజాగా హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో మరో యాడ్ చేశాడు. దాని కోసమే ఈ కొత్త లుక్. ఈ ఫోటోని బన్ని సోషల్ మీడియా షేర్ చేయగా.. కొన్ని సేపట్లోనే అది నెట్టంట వైరల్ అయ్యింది. బన్నీ నయా లుక్ అదిరిందంటూ.. లైక్స్, రీట్వీట్స్ చేస్తూ సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. అంతేకాదు.. పుష్ప-2లోనూ ఇదే లుక్‌లో కనిపిస్తే, రచ్చ మామూలుగా ఉండదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి, ఆ సీక్వెల్‌లో బన్నీ ఇదే లుక్‌లో కనిపిస్తాడా? లేక పుష్ప-1 లుక్‌నే కంటిన్యూ చేస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
Also Read
కాగా.. ‘పుష్ప: ద రైజ్’ సినిమా ఘనవిజయం సాధించడంతో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. దీంతో.. సీక్వెల్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ముందుగా రాసుకున్న స్క్రిప్ట్‌ని మార్చేసి, కొత్తగా మెరుగులు దిద్దుతున్నాడు. ఈసారి బడ్జెట్ కూడా భారీగా పెరగనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాలని ప్రణాళికలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!