Pushpa 2: టాలీవుడ్ తో పాటు అన్ని భాషల ప్రేక్షకులందరు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్- రష్మిక జంటగా నటించిన పుషప్ చిత్రం ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఒక సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పుష్ప.. పుష్ప రాజ్.. తగ్గేదేలే అన్న డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో నడుస్తోంది. ఇక పుష్ప మ్యానియా తరువాత ప్రతి ఒక్కరూ పుష్ప 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్స్ ను డెవలప్ చేసే పనిలో ఉన్న విషయం తెల్సిందే. పుష్పను మించి పుష్ప 2 పై అంచనాలు ఉండడంతో సుకుమార్ ఎంతో జాగ్రత్తగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. షూటింగ్ కొద్దిగా ఆలస్యం అయినా పర్లేదు.. సినిమా మాత్రం అదిరిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇందుకోసమే సుకుమార్ తో పాటు ఈ సినిమా కోసం మరో డైరెక్టర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన.
ఉప్పెన చిత్రంతో బిగ్గెస్ట్ హాట్ అందుకున్న బుచ్చిబాబు, ఎన్టీఆర్ కోసం వెయిటింగ్ లో ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే గురువు సుకుమార్ తో కలిసి పుష్ప 2 కోసం వర్క్ చేస్తున్నాడట. ఇటీవల గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా అక్కడ గురుశిష్యులు దర్శనమిచ్చారట. సుకుమార్ కు చేదోడువాదోడుగా స్క్రిప్ట్ విషయంలో సలహాలు కూడా ఇస్తున్నాడట బుచ్చిబాబు. ఇక దీంతో అభిమానులు ఉప్పెన లాంటి కథలు చెప్పకు భయ్యో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే మేకర్స్ నోరు విప్పాల్సిందే.