Sai Pallavi: చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబోలు ఎంతో ప్రత్యేకం. ఇంకొన్ని సంథింగ్ స్పెషల్ గా ఉంటాయి. అవి ఎప్పుడెప్పుడు సెట్ అవుతాయా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూసే కాంబోలో అల్లు అర్జున్, సాయి పల్లవి కాంబో ఒకటి. ఇద్దరు డాన్సర్లు. వీరిద్దరి మధ్య ఒక మాస్ సాంగ్ పడితే చూడాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటున్నాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే త్వరలోనే ఈ కాంబో సెట్ అవుతుందని గుసగుస వినిపిస్తోంది. ప్రస్తుతం బన్నీ, పుష్ప 2 లో నటిస్తున్న విషయం విదితమే. ఇక ఈ చిత్రంలోనే సాయి పల్లవి నటిస్తుందని టాక్ నడుస్తోంది. రష్మిక పాత్ర చనిపోతుంది ఇప్పటికే వార్తలు వచ్చాయి.
సెకండ్ హీరోయిన్ గా రష్మిక ప్లేస్ లో సాయి పల్లవిని కన్ఫర్మ్ చేసారట మేకర్స్.. ఇందులో సాయి పల్లవి ఒక గిరిజన యువతిగా కనిపిస్తుందని, స్మగ్లింగ్ కోసం ఆ తండాకు వెళ్లిన పుష్పకు సాయి పలలవి హెల్ప్ చేయడం వలన వారి మధ్య ప్రేమ చిగురిస్తుందని కథలు కూడా చెప్పేస్తున్నారు. అయితే పాత్ర బాగోలేకపోతే స్టార్ హీరో పక్కన కూడా నటించాను అని ముఖం మీదనే చెప్పే సాయి పల్లవి సెకండ్ హీరోయిన్ గా కమర్షియల్ చిత్రంలో నటించడానికి ఎలా ఒప్పుకొంటుంది.. ఇదంతా ఫేక్ అయ్యి ఉంటుందని మరికొందరి వాదన.. అయితే ఇందులోనూ నిజం లేకపోలేదు అంటున్నారు మరికొందరు. కానీ సుకుమార్ లాంటి డైరెక్టర్ సాయి పల్లవిని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడని టాక్ వినిపిస్తుండడంతో నిజమేనేమో అన్న సందేహాలు రాకమానడం లేదు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే మేకర్స్ ఎవరో ఒకరు ఈ వార్త గురించి నోరు విప్పాల్సిందే..