హీరో అల్లు అర్జున్ పై సస్పెన్షన్‌కు గురైన ఏసీపీ విష్ణుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా పోలీసుల మీద నిందలు వేస్తున్నారు.. డబ్బు మదంతో ఓ హీరో పోలీసుల మీద అనుచిత మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఓ కేసులో ముద్దాయిగా ఉన్న హీరో ప్రెస్ మీట్ పెట్టవచ్చా అని ప్రశ్నించారు. కొన్ని ఘటనలను ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నాడని దుయ్యబట్టారు.
పోలీసులు వద్దన్నా సినీ హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కు వెళ్లాడని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అయ్యాడన్నారు. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం మామూలు విషయం కాదని, ఘటన జరిగిన తర్వాత కనీసం పరామర్శించకపోవడం దారుణం అని పేర్కొన్నారు. ఏదో జరిగినట్లు అల్లు అర్జున్ను పెద్దపెద్ద హీరోలు పరామర్శించడం విడ్డూరంగా ఉందని, చట్టం ముందు అందరూ సమానులే అని…
Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తెలుగులోనే కాకుండా హిందీ ల్యాండ్‌లో సత్తా చాటింది. అయితే, ఇలాంటి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఓ గ్యాంగ్ స్టర్‌ని పోలీసుల చాకచక్యంగా పట్టుకున్నారు. నాగ్‌పూర్‌లో సినిమా చూస్తున్న సమయంలో డ్రగ్స్ స్మగ్లింగ్, హత్యలతో సంబంధం ఉన్న పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ని అరెస్ట్ చేశారు.
అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అల్లు అర్జున్‌లో కనీసం ప్రశ్చాత్తాపం కనిపించడం లేదు.. రేవతి కుటుంబం పైన అల్లు అర్జున్ కనీస సానుభూతి చూపించలేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పు పట్టేలా అల్లు అర్జున్ తీరు ఉందని పేర్కొన్నారు.
Bandi Snajay: ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ అన్నారు. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచిందన్నారు. ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ కు అదే గతి పడుతుందన్నారు.
Bandi Sanjay: అల్లు అర్జున్ను, సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు సీఎం స్థాయి వ్యక్తి యత్నించడం అత్యంత బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తరువాతే సంధ్య థియేటర్ కు వచ్చినట్లు అల్లు అర్జున్ చెబుతున్నారు.
MP Chamala Kiran: అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై స్పందించిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌కి తన సినిమాల కలెక్షన్లు తప్ప ప్రజల గురించి పట్టింపు లేదని అన్నారు.
Daggubati Purandeswari : టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్పా-2’ చిత్రం విడుదల నేపథ్యంలో, థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్ళిన అల్లుఅర్జున్‌పై జరిగిన ఘటన గురించి బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె ప్రకాశంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా అల్లు అర్జున్ను అరెస్టు చేయడం సరైనదే కాదని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ఈనెల 13వ తేదీన అరెస్టు…
‘పుష్ప 2’ బాలీవుడ్ దండయాత్ర ఇప్పట్లో ఆగేలా లేదు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. సౌత్ తో పోలిస్తే ఈ సినిమా హిందీలో ఒక రేంజ్ లో దూసుకెళ్తోంది. సెకండ్ వీకెండ్ లోనూ థియేటర్లలో విపరీతమైన ప్రేక్షకులను ఆకర్షించిన ‘పుష్ప 2’ వర్కింగ్ డేస్ లో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టి వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది. డిసెంబరు…
అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్చ్ చేశారు. మీరు తప్పుడు సమాచారం అనుకోండి, తప్పుడు ప్రచారం అనుకోండి, తప్పుడు ఆరోపణలు అనుకోండి అయినా సరే ఆరోజు నేను ఎలాంటి రోడ్ షో చేయలేదు ఊరేగింపు చేయలేదు.. థియేటర్ లోపలికి వెళుతున్నప్పుడు జనాలు ఎక్కువగా ఉంటే చేయి ఊపి లోపలికి వెళ్ళిపోయాను. థియేటర్ లోపల నేను సినిమా చూస్తున్న కొద్దిసేపటికి నా వరకు ఏ పోలీస్ కాని ఎవరూ రాలేదు. నా వరకు ఎవరూ కలవలేదు నాకేమీ…