ఈరోజు అల్లు అర్జున్ ఇంటిని ఓయూ జేఏసీ ముట్టడించిన సంగతి తెలిసిందే.. ఇంటిపై టమాటాలు, రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో.. ఇంట్లో పూల కుండీలు ధ్వంసమయ్యాయి. కాగా.. విషయం తెలుసుకున్న పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని విద్యార్ధి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. 8 మంది ఓయూ జేఏసీ నేతలను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే.. దాడి జరిగిన సమయంలో ఇంట్లో అల్లు అర్జు్న్ లేరు. దాడి అనంతరం.. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని సెక్యురిటీ నుంచి వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం.. అల్లు అర్జున్ కొడుకు, కూతురును తన వెంట తీసుకొని వెళ్లారు.
Read Also: Bandi Sanjay: కిమ్స్ ఆస్పత్రిలో శ్రీ తేజ్‌ను పరామర్శించిన కేంద్రమంత్రి..
కాగా.. దాడి ఘటనపై అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. తమ ఇంటి వద్ద జరిగిన ఘటన అందరూ చూశారని.. తమ ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారన్నారు. వారిపై కేసు పెట్టారని చెప్పారు. ఇంటి దగ్గరికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే.. పోలీసులు వాళ్ళను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యలు ప్రేరేపించకూడదు.. ప్రస్తుతం ఈ అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకే సమయమనం పాటిస్తున్నాం.. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు అల్లు అరవింద్ చెప్పారు.
Read Also: MP: భార్య వేధింపులు భరించలేక మరో వ్యక్తి ఆత్మహత్య.. వీడియో తీసి..