Allu Arjun : నేడు పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం మరోసారి నోటీసులు ఇచ్చారు. నేడు ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. పుష్ప -2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఇటీవల అరెస్టయిన అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. గత రెండు రోజులుగా వాదోప వాదనలతో ఈ కేసు వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయంశంగా మారింది.
Also Read : Jr. NTR : వార్ – 2 షూటింగ్ ముగిసింది.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
Also Read
ఇదిలా ఉండగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌ను నేడు పోలీసులు మరోసారి ప్రశ్నించనున్నట్లు సమాచారం. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో మొత్తం 18మందిపై పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ ఈకేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. తాజాగా పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేయడంతో అల్లు అర్జున్ తమ లీగల్ టీమ్‌తో గత రాత్రి అత్యసరంగా సమావేశమయ్యారు. నేడు విచారణ సమయంలో పోలీసులు అడగబోయే ప్రశ్నలపై ఎలా స్పందిచాలనే విషయమై సుదీర్ఘ చర్చలు జరిపారు. నేడు పోలీసుల ముందు విచారణకు హాజరుకానున్న అల్లు అర్జున్ ను మరోసారి అరెస్ట్ చేస్తారేమో అని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!