Allu Arjun: సంధ్య తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పీఎస్‌లో హీరో అల్లు అర్జున్ విచారణ పూర్తి అయింది. విచారణ ముగిసిన అనంతరం ఎవరితో మాట్లాడకుండానే అల్లు అర్జున్ కారులో వెళ్లిపోయారు. అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన, అనంతరం జరిగిన…
Allu Arjun Bouncer Arrest: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం. ఈ మేరకు అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్ ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Advocate Varma: సంధ్యా థియేటర్ తొక్కిస లాట ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటికే ఒకసారి అల్లు అర్జున్ స్టేట్‌ను రికార్డు చేసిన చిక్కడపల్లి పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేసి ఇవాళ రెండోసారి ప్రశ్నిస్తున్నారు.
Allu Arjun Live Updates: పుష్ప -2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం మరోసారి నోటీసులు ఇచ్చారు. నేడు ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. పుష్ప -2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఇటీవల అరెస్టయిన అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. గత రెండు రోజులుగా వాదోప వాదనలతో ఈ కేసు వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయంశంగా మారింది.…
విడుదల తేదీకి ముందురోజే పెద్ద హంగామా చేస్తూ స్పెషల్ షోలు పడతాయి. బెనిఫిట్ షో పేరుతో సినిమాలు ప్రదర్శించి ఇష్టారాజ్యంగా టికెట్ రేట్లు పెడతారు. నటుల మీద అభిమానులకున్న పిచ్చిని ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నారు. బెనిఫిట్ షో సంస్కృతి పాతదే అయినా.. గతానికీ, ఇప్పటికీ బెనిఫిట్ షోలు పూర్తిగా మారిపోయాయని మాత్రం చెప్పక తప్పదు.
బీజేపీ ఎందుకు...అల్లు అర్జున్‌కు సపోర్టు చేసేలా మాట్లాడుతుందనే చర్చ జనాల్లో జరుగుతోంది. మహిళ మరణించడం బాధాకరం అంటూనే...ఆ మహిళ కుటుంబాన్ని ప్రభుత్వం, అల్లు అర్జున్ పట్టించుకోవాలని కాషాయ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు ఆ సంఘటన జరిగి ఉండాల్సింది కాదని అంటున్న కమలం నేతలు...అనుమతి లేకున్నా అయనను ఎలా రోడ్ షో చేయించారని ప్రశ్నిస్తున్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. పోలీసులు నోటీసులు అందించిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంట్లో కీలక సమావేశం జరుగుతోంది. తమ లీగల్ టీమ్‌తో అల్లు అర్జున్ సమావేశమయ్యారు.