Margani Bharat: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ.. వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అని సెటైర్లు వేశారు. ఇదే మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి.. హైదరాబాదు ఇంకా మేమే అభివృద్ధి చేశామని డబ్బా కొట్టుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.
YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో, వైఎస్సార్సీపీ స్పందనగా విమర్శలతో కూడిన పుస్తకాన్ని విడుదల చేసింది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. “జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం” అనే శీర్షికతో ఈ పుస్తకం విడుదలైంది. Read Also: Perni Nani: నాకు ఎదురైన బాధ ఎవరికి రాకూడదు.. మాజీ మంత్రి ఆవేదన..! ఈ…
జనసేన పార్టీ 11ఏళ్లు పూర్తి చేసుకుని 12 ఏట అడుగు పెట్టింది. నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా నేడు కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు. జనసేన 12 ఏళ్ల పండుగ వైభవంగా సాగుతోంది.. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేస్తారు. సభలో 90 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు..
కూటమి ప్రభుత్వంలో ఏపీ అరాచకాలకు అడ్డగా మారిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేస్తున్నారని తెలిపారు. పోలీసులు కూడా దాడి చేసే వారికే సలాం కొడుతున్నారు.. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని దుయ్యబట్టారు. కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు.. ఇళ్లకు వెళ్లి జనాల చొక్కాలు పట్టుకుని బయటకు లాగుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే చల్లారుతోంది. తాజాగా రాజకీయ పార్టీలకు మళ్లీ పరీక్ష మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ వైసీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
రెండ్రోజుల్లో అన్ని స్టాక్ పాయింట్లలో తనిఖీలు పూర్తి చేయాలని సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. సివిల్ సప్లయిస్ కార్యాలయంలో తూనికలు కొలతలు విభాగపు అధికారులతో సివిల్ సప్లయిస్ మంత్రి మనోహర్ నాదెండ్ల సమీక్షించారు.
పదేళ్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోరాటానికి ఫలితం లభించింది. గత పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల తరఫున కొట్లాడారు. రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయినా.. వెనకడుగు వేయలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా మూడోసారి ఎన్నికల్లో పోటీ చేశారు.