YSRCP: “జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం” పుస్తకం విడుదల..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో, వైఎస్సార్సీపీ స్పందనగా విమర్శలతో కూడిన పుస్తకాన్ని విడుదల చేసింది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. “జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం” అనే శీర్షికతో ఈ పుస్తకం విడుదలైంది.
Read Also: Perni Nani: నాకు ఎదురైన బాధ ఎవరికి రాకూడదు.. మాజీ మంత్రి ఆవేదన..!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. గత ఏడాది మూడు పార్టీల కలయికగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయారు. ప్రజల గొంతు వినకుండా, రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఉపయోగించి పాలన చేస్తున్నారని ఆరోపించారు.
Read Also: Ukraine Russia War: ఉక్రెయిన్ బంపర్ ఆఫర్.. రష్యన్ డ్రోన్‌లను కూల్చేస్తే నెలకు రూ. 2 లక్షలు
అలాగే సజ్జల మాట్లాడుతూ.. 2019లో వైఎస్సార్సీపీ ఒంటరిగానే ఘన విజయం సాధించింది. జగన్ తొలి ఏడాది పాలనలో బంగారు భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశారు. ప్రతి రంగానికి విశ్వసనీయతను అందించారని పేర్కొన్నారు. అయితే, ఈ కూటమి ప్రభుత్వం ఐదు కోట్ల ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. చంద్రబాబు నాయుడు ఈ వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి, అన్ని రంగాలను ధ్వంసం చేశారని విమర్శలు గుప్పించారు. ఈ పుస్తకం ప్రజలకు నిజాలను తెలియజేయాలనే ఉద్దేశంతో విడుదల చేశామన్నారు. అందులో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవ ఆధారాలపై ఆధారపడ్డాయని, ప్రజలు ఈ సమాచారాన్ని గమనించి నిశితంగా విశ్లేషించాలని వైసీపీ నేతలు కోరారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!