పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి ప్రారంభమై 22 వరకు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి డిసెంబరు 2న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.. పోలవరం ప్రాజెక్టు బకాయిలన్నీ చెల్లించాలి.. ఎస్సీ, ఎస్టీ తరహాలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. రైల్వేజోన్ ఏర్పాటుపై మాటనిలబెట్టుకోవాలంటూ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి.
Monsoon Session 2023: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో నిర్వహించారు. రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులను సమీక్షించేందుకు అమిత్ షా ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.
Manipur Violence: నెల రోజుల నుంచి మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఘర్షణ తీవ్ర హింసకు దారి తీసింది. సైన్యం, సీఆర్పీఎస్ బలగాలు రాష్ట్రంలో మోహరించినా పరిస్థితి చక్కబడటం లేదు.
Payyavula Keshav: వలస ఓటర్లు దేశంలో ఎక్కడి నుంచైనా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా రిమోట్ ఓటింగ్ మెషీన్ (ఆర్వీఎమ్) విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ఢిల్లీలో ఈ అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది. దీనిపై మరోసారి చర్చ జరగాలని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. రిమోట్ ఓటింగ్ మెషీన్ ఆలోచనను తాము సూత్రప్రాయంగా స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే ఎన్నికల సంఘం అనుసరించిన…
విపక్షాల అఖిలపక్ష సమావేశంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్నినాని.. సీఎం వైఎస్ జగన్‌పై నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఎందుకు మీ అందరికీ భయం? కలిసి ఎందుకు పోరాటం చేయాలనుకుంటున్నారు? అంటూ నిలదీశారు.. చంద్రబాబు ఏ డ్యాన్స్ వేయమంటే ఆ డ్యాన్స్ వేస్తారు సీపీఐ రామకృష్ణ.. ఎక్కడ చిందు వేయమంటే అక్కడ వేస్తారు.. నారాయణ, రామకృష్ణ, వంటి కుహనా మేధావులు అందరూ చంద్రబాబు పక్కన చేరారని ఫైర్ అయ్యారు. సోనియా గాంధీతో కుమ్మక్కై మీరందరూ ఎన్ని…
అఖిలపక్ష సమావేశం ముగిసింది.. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటూ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.. వివిధ తీర్మానాలు చేసింది అఖిలపక్ష సమావేశం. జగన్ ప్రభుత్వ హింసాత్మక చర్యలపై సీజేఐను కలిసి వినతిపత్రం ఇవ్వాలని, రాష్ట్రస్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు చేయాలని, జిల్లా, మండల స్థాయిలో పరిరక్షణ వేదిక కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వ అణిచివేతకు గురైన వారికి వేదిక అండగా ఉండాలని, ప్రభుత్వ విధానాలపై పరిరక్ష వేదిక పనిచేయాలని తీర్మానించారు. ఇక, వైఎస్ జగన్ హయాంలో…