Delimitation: తమిళనాడులో డీలిమిటేషన్ (Delimitation) అంశంపై అఖిలపక్ష సమావేశం కీలక తీర్మానాలను ఆమోదించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేపట్టారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని, రాబోయే 30 ఏళ్లపాటు అదే అమల్లో ఉండాలని స్టాలిన్ స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశంలో ప్రస్తుత లోక్‌సభలో ఉన్న 543 సీట్లనే కొనసాగించాలని తీర్మానించారు. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల నష్టపోకుండా ఉండాలని, ఇతర…
ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ అజెండాపై అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించింది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, కీలక బిల్లుల ఆమోదానికి మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలను ప్రభుత్వం కోరింది. అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, వైసీపీ తరపున మిథున్ రెడ్డి, జనసేన తరపున బాలశౌరి హాజరయ్యారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. సాయంత్రం 4 గంటలకు ఆయన నివాసంలో జరిగే ఈ సమావేశంలో దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన నీటి బిల్లుల అంశంపై చర్చించనున్నారు.
ఢిల్లీ: బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక గురువారం (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రజలు, ఉద్యోగులు, అన్నదాతలు, రాష్ట్ర ప్రభుత్వాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి ఏమైనా వరాలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తు్న్నారు. ఇక బడ్జెట్ మర్మమేంటో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
17వ లోక్‌సభ చివరి సమావేశాలు రేపటి (జనవరి 31)నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నేటి ఉదయం 11.30 గంటలకు సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సమాచారం ఇచ్చింది.
మిగిలింది ఆరు నేలలు మాత్రమే.. అందుకే విభజన హామీలు పూర్తి చేయాలని కోరామని టీడీపీ ఎంపీ కనకమేడల అన్నారు. పోలవరం పూర్తి చెయ్యాలి.. రాష్ట్ర రాజధాని లేకుండా ఉంది.. పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడ్డ క్యాపిటల్ ను మారుస్తున్నారు.. ఆర్థిక పరిస్థితి, లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించాలి అని ఆయన కోరారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు వచ్చారు. అయితే, ఢిల్లీలో పొగ మంచు కారణంగా విమానాల దారి మళ్లింపుతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కాలేకపోయారు.
డిసెంబర్ 4 నుంచి 22వ తేదీ వరకు భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. 19 రోజుల్లో 15 సిట్టింగుల్లో పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగనుంది.