ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప : ది రైజ్” బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆయన గత చిత్రం “అల వైకుంఠపురములో” హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా థియేటర్లలో విడుదల అవుతుందని ప్రకటించారు. హిందీ డబ్బింగ్ వెర్షన్ హక్కులను మనీష్ సొంతం చేసుకున్నాడు. కానీ అప్పటికే “అల వైకుంఠపురములో” హిందీ రీమేక్ వెర్షన్ తెరకెక్కుతుండడంతో వివాదం మొదలైంది. దీంతో హిందీ వెర్షన్ థియేట్రికల్ విడుదలను రద్దు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. “షెహజాదా” అనే టైటిల్ తో…
‘పుష్ప’ బాలీవుడ్ సక్సెస్ అరవింద్ కి 9 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎలాగంటారా!? ‘పుష్ప’ సూపర్ హిట్ కావటంతో బాలీవుడ్ లోనూ అల్లు అర్జున్ మేనియా మొదలైంది. పుష్ప పాటలు టిక్ టాక్ రూపంలో వైరల్ కావడంతో పాటు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. దీంతో బన్నీ నంటించిన ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ ను థియేటర్లలో విడుదల చేయటానికి రెడీ అయ్యాడు గోల్డ్ మైన్ టెలిఫిలిమ్స్ అధినేత మనీశ్. తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్,…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప : ది రైజ్” ఇటీవల విడుదలై అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఉత్తర భారతదేశంలోని థియేటర్‌లలో అద్భుతమైన బిజినెస్ చేసింది. మహమ్మారి పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నా కూడా ఈ చిత్రం ఉత్తరాదిలో 80 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున, రష్మిక మందన్న నటనకు, మ్యూజిక్ తో దేవిశ్రీ చేసిన…