పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. కోబ్రీ సమీపంలో గురువారం ఐదుగురు భారతీయ కార్మికులను సాయుధ వ్యక్తులు కిడ్నాప్ చేశారని భద్రతా వర్గాలు తెలిపాయి. కార్మికులు విద్యుత్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నట్లు వెల్లడించాయి. ఇక కిడ్నాప్ వార్తలను కంపెనీ కూడా ధృవీకరించింది.
Osama Bin Laden: పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సన్నిహితుడు, అధికార ప్రతినిధి ఫర్హాతుల్లా బాబర్ తాను రాసిన కొత్త పుస్తకం ‘‘ది జర్దారీ ప్రెసిడెన్సీ: నౌ ఇట్ మస్ట్ బీ టోల్డ్’’లో సంచలన విషయాలను పేర్కొన్నారు. అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను తమ భూభాగంపై.. అదీ తమకు తెలియకుండా అమెరికా బలగాలు రహస్యంగా మట్టుబెట్టడం పాకిస్థాన్ నేతలను తీవ్ర అవమానానికి, అయోమయానికి గురిచేసిందని రాసుకొచ్చాడు.. అప్పటి 2011లో అబోటాబాద్‌లో లాడెన్ హత్యానంతరం…
US Airstrike On Syria: సిరియాలోని వాయువ్య ప్రాంతంలో గురువారం జరిగిన వైమానిక దాడిలో అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మహ్మద్ సలాహ్ అల్-జబీర్‌ను అమెరికా సైన్యం హతమార్చింది. తీవ్రవాద గ్రూపులను నాశనం చేసి వారి కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ వైమానిక దాడి జరిగిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. జబీర్ అల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన హుర్రాస్ అల్-దిన్ అనే…
Bangladesh: ఎప్పుడైతే బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఆగస్టు 05న భారత్ పారిపోయి వచ్చిందో అప్పటి నుంచి ఆ దేశం క్రమంగా పాకిస్తాన్ జిరాక్స్ కాపీలా మారుతోంది. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్‌కి మించి అక్కడ ఇస్లామిక్ రాడికల్ శక్తులు ఎదుగుతున్నాయి. పాకిస్తాన్ ప్రేమికులుగా పేరున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)తో పాటు రాడికల్ ఇస్లామిక్ శక్తులైన జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా వంటి శక్తులు ఆడిండే ఆటగా అక్కడ పాలన సాగుతోంది.
Hamza Bin Laden: అల్‌ఖైదా వ్యవస్థాపకుడు, 9/11 దాడుల నిందితుడు, ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ ఇంకా బతికే ఉన్నాడని అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయి. ఆల్‌ఖైదా నాయకత్వాన్ని స్వీకరించాడని చెప్పాయి. 2019లో మరణించినట్లు భావిస్తున్న హంజా బిన్ లాడెన్ బతికే ఉన్నాడని నివేదికలు సూచించడం సంచలంగా మారింది. ఆల్‌ఖైదాను పునరుద్ధరించడంతో పాటు వెస్ట్రన్ దేశాలపై దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలిపాయి.
Burkina Faso: వెస్ట్ ఆఫ్రికన్ దేశమైన బుర్కినా ఫాసోలో మరోసారి హింస చెలరేగిపోయింది. కయాకు ఉత్తరాన 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న బార్సలోగో ప్రాంతంలో శనివారం జరిగిన ఈ దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Pakistan: ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్ అత్యంత సన్నిహితుడిగా పరిణగించబడుతన్న అమీన్ ఉల్ హక్‌ని పాకిస్తాన్‌లో శుక్రవారం అరెస్ట్ చేశారు. యూఎన్ ఆంక్షల జాబితాలో ఉన్న ఉగ్రవాది అయిన హక్‌ని పంజాబ్ ప్రావిన్స్ ఉగ్రవాద నిరోధక అధికారులు పట్టుకున్నారు.
Pakistan: మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్‌లో తలదాచుకున్నట్లు, 2011లో అతడిని చంపడానికి ముందే అమెరికా తనకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 2011లో అమెరికన్ కమాండోలు పాకిస్తాన్‌లో అబోట్టాబాద్‌లో బిన్ లాడెన్‌ని చంపేశారు. తాజాగా జియో న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Al-Qaida : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ రౌడీగా జీవితం ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. 2004 నుంచి 2009 వరకు ఎంపీగా ఉన్న సమయంలో ఆయనపై పలు హత్యలు, కిడ్నాప్ కేసులు ఉన్నందున పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.
యూపీ గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్యపై భారత్‌పై దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ బెదిరించింది. కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ను హత్య చేసినందుకు భారతపై దాడులు చేస్తామని అల్-ఖైదా (AQIS) హెచ్చరించింది.