Al-Qaida : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ రౌడీగా జీవితం ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. 2004 నుంచి 2009 వరకు ఎంపీగా ఉన్న సమయంలో ఆయనపై పలు హత్యలు, కిడ్నాప్ కేసులు ఉన్నందున పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. కాగా, క్రిమినల్ కేసులో జైలులో ఉన్న అతిక్ అహ్మద్, అతని సోదరుడు అర్షబ్ అహ్మద్‌లను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు గత శనివారం ప్రయాగ్‌రాజ్‌లోని ఆసుపత్రికి తీసుకువచ్చారు.
Read Also: MS Dhoni : ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లకు ధోని సలహాలు, సూచనలు
ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు అతిక్ అహ్మద్, అర్షబ్ అహ్మద్‌లను కాల్చి చంపారు. అతిక్ అహ్మద్, అర్షబ్ అహ్మద్‌లను జర్నలిస్టులుగా నటిస్తున్న ముగ్గురు వ్యక్తులు కాల్చిచంపారు. పోలీసుల కళ్లెదుట జరిగిన ఈ ఘటనను టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. కాల్పులకు పాల్పడిన సన్నీ సింగ్, లవలేష్ తివారీ, అరుణ్ మౌర్యలను అరెస్టు చేశారు. ఈ కేసులో మాజీ ఎం.పి. అతిక్ మహ్మద్‌ను కాల్చిచంపినందుకు ప్రతీకారంగా భారత్‌పై దాడి చేస్తామని అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది.
Read Also:Meat Plant : పంజాబ్ లో ఘోరం.. మీట్ ప్లాంట్‌లో నలుగురు కూలీలు దుర్మరణం
భారత ఉపఖండంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అల్ ఖైదా ఇస్లామిక్ మతపరమైన పండుగ రంజాన్‌పై సందేశం ఇచ్చింది. అందులో అతిక్ మహ్మద్, అతని సోదరుడు అర్షబ్ మహ్మద్‌ను అమరవీరులుగా గుర్తించామని పేర్కొన్నారు. ఈ మారణకాండకు ప్రతీకారం తీర్చుకుంటామని, ముస్లింలను విడిపించుకుంటామని ఉగ్రవాద సంస్థ 7 పేజీల లేఖను విడుదల చేసింది.