Burkina Faso: బుర్కినా ఫాసోలో మళ్లీ చెలరేగిన హింస.. జిహాదీల ఊచకోతలో 200 మంది మృతి..!
- బుర్కినా ఫాసోలో మరోసారి చెలరేగిన హింస..
- సైనికులు
- గ్రామస్థుల మీద కాల్పులు జరిపిన జీహాదీలు..
- అల్‌ఖైదా ఉగ్రవాదుల కాల్పుల్లో దాదాపు 200 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Burkina Faso: వెస్ట్ ఆఫ్రికన్ దేశమైన బుర్కినా ఫాసోలో మరోసారి హింస చెలరేగిపోయింది. కయాకు ఉత్తరాన 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న బార్సలోగో ప్రాంతంలో శనివారం జరిగిన ఈ దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అల్-ఖైదాతో సంబంధం ఉన్న జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (JNIM) అనే జిహాదీలు జరిపిన తుపాకీ కాల్పుల్లో దాదాపు 200 మంది చనిపోగా.. మరో 140 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ ప్రాంతానికి చెందిన రీజినల్ స్పెషలిస్ట్ ఒకరు చెప్పుకొచ్చారు. మృతుల్లో గ్రామస్థులు, సైనికులు ఉన్నారని పేర్కొన్నారు. బర్సాలోగో దగ్గర శనివారం భద్రతా బలగాలు, గ్రామస్థులు కలిసి భద్రతా అవుట్‌పోస్టులను రక్షించడానికి కందకాలు తవ్వుతుండగా వారిపై జిహాదీలు కాల్పులకు దిగారు. ఈ దాడిలో అనేక మంది సైనికులు, ప్రజలు చనిపోయారని అల్‌ఖైదా ప్రకటించింది.
Read Also: WBBL 10: అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టులోకి భారత వైస్ కెప్టెన్ స్మృతి మందాన..
Also Read
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
- US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను అల్‌ఖైదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఈ దాడి జరగబోతోందని బుర్కినా ఫాసో సైన్యానికి శుక్రవారం సమాచారం వచ్చింది.. కందకాలు తవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారని నికోలస్ హక్ అనే స్థానిక రిపోర్టర్ పేర్కొన్నాడు. ఈ దాడిలో గాయపడిన వారికి వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని కయా పట్టణం నుంచి పిలిపించారు. బుర్కినా ఫాసో దేశంలో సగానికిపైగా భూభాగం అక్కడి ప్రభుత్వ నియంత్రణలో లేకుండా పోయింది. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అక్కడి ప్రజలలో వేలాది మందిని చంపేశారు. ‘జిహాదీ గ్రూపుల దాడిలో సైనికులు, సామాన్య పౌరులు మరణించారని ఆ దేశ రక్షణ మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
-
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్‌ప్లే, 108MP కెమెరా
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
-
TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
-
Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!