Prathibimbalu: మహానటుడు అక్కినేని 40 సంవత్సరాల క్రితం నటించిన 'ప్రతిబింబాలు' సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అయింది. విష్ణు ప్రియ సినీ కంబైన్స్ పతాకంపై కె.యస్. ప్రకాశరావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాను రాజేశ్వర్ రాచర్ల సమర్పణలో 2కె హెడి రిజల్యూషన్ తో విడుదల చేయబోతున్నారు.
తెలుగు చిత్రసీమలో వెలుగు చూసిన మల్టీస్టారర్స్ లో విజయావారి ‘గుండమ్మ కథ’ ప్రత్యేక స్థానం సంపాదించింది. పలు విశేషాలకు నెలవుగా ‘గుండమ్మ కథ’ నిలచింది. పౌరాణిక బ్రహ్మగా పేరొందిన కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన సాంఘిక చిత్రాలు కొన్నే. వాటిలో ఘనవిజయం సాధించిన ఏకైక చిత్రం ‘గుండమ్మ కథ’. మహానటుడు యన్టీఆర్ నూరవ చిత్రంగా తెరకెక్కిన సినిమా కూడా ఇదే! ఈ చిత్రం తమిళ వర్షన్ ‘మనిదన్ మారవిల్లై’ మరో మహానటుడు ఏయన్నార్ కు వందో సినిమా…
ఏపీలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రాల ఏర్పాటుపై కొన్నిచోట్ల అభ్యంతరాలు వినిపిస్తుండగా.. మరికొన్ని చోట్ల జిల్లాల పేర్ల విషయంలో కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాలకు వంగవీటి రంగ, భూమా నాగిరెడ్డి పేర్లు పెట్టాలనే డిమాండ్లు రాగా.. తాజాగా ఓ జిల్లాకు దివంగత దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని ఆయన అభిమాన సంఘం డిమాండ్ చేస్తోంది. మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఏఎన్ఆర్ పేరు పెట్టాలని…
(అక్టోబర్ 5న వాగ్దానంకు 60 ఏళ్ళు) తెలుగు నాట నవలానాయకునిగా జేజేలు అందుకున్నారు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. ఆరంభంలో బెంగాలీ నవలలతోనే అక్కినేని పలు విజయాలు చవిచూశారు. దేవదాసు బెంగాలీ నవల ఆధారంగా రూపొందిన చిత్రంతోనే ఏయన్నార్ కు మహానటుడు అన్న ఇమేజ్ లభించింది. దాంతో వరుసగా కొన్ని బెంగాలీ నవలల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలలో ఏయన్నార్ నటించారు. అవి సంతృప్తి కలిగించాయి. ఈ నేపథ్యంలో దేవదాసు నవల రచయిత శరత్ బాబు రాసిన దత్త నవల…
తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అనగానే నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ముందుగా గుర్తుకు వస్తారు. ఆయన నటజీవితంలో పలు మేలుమలుపులన్నీ నవలాచిత్రాలే కావడం విశేషం. ఏయన్నార్ ను మహానటునిగా నిలిపిన ‘దేవదాసు’ చిత్రం శరత్ చంద్ర ఛటర్జీ రాసిన బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కింది. ఆ తరువాత బెంగాలీ నవలలతోనే ఏయన్నారు మంచి విజయాలను చవిచూశారు. మణిలాల్ బెనర్జీ రాసిన ‘స్వయంసిద్ధ’ ఆధారంగా రూపొందిన ‘అర్ధాంగి’లో అక్కినేని పిచ్చివాడుగా చేసిన అభినయం ఆకట్టుకుంది. మరో మహానటుడు యన్టీఆర్ తో…
(జూలై 16తో ‘శ్రీమంతుడు’కు 50 ఏళ్ళు) విశ్వభారతి ప్రొడక్షన్స్ పతాకంపై కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో నటసమ్రాట్ ఏయన్నార్, జమున జంటగా రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు’. ప్రత్యగాత్మ, ఏయన్నార్ కాంబినేషన్ లో పలు చిత్రాలు రూపొంది, మంచి విజయం సాధించాయి. అదే తీరున ‘శ్రీమంతుడు’ కూడా పాటలతో అలరిస్తూ ఆదరణ పొందింది. 1971 జూలై 16న విడుదలయిన ఈ చిత్రం టాక్ బాగానే ఉన్నా, అప్పటి ఏయన్నార్ రంగుల చిత్రాల హవా ముందు నిలవలేకపోయిందనే చెప్పాలి. కథేమిటంటే… ‘శ్రీమంతుడు’ కథ…