నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ అంటే అప్పట్లో జనానికి భలే క్రేజ్! ఏయన్నార్, దాసరి కలయికలో ఓ డజన్ సినిమాలు వెలుగు చూశాక వచ్చిన చిత్రం ‘బహుదూరపు బాటసారి’. ఈ సినిమాకు ముందు దాసరి దర్శకత్వంలో ఏయన్నార్ నటించిన “ఏడంతస్తుల మేడ, శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం” వంటి హిట్ మూవీస్ జనాన్ని భలేగా అలరించాయి. వాటిలో ‘ప్రేమాభిషేకం’ ప్లాటినమ్ జూబ్లీ కూడా చూసింది. దాంతో దాసరి-అక్కినేని కాంబో అనగానే జనానికి సదరు చిత్రంపై…
ప్రపంచంలోని ఎలాంటి ప్రదేశానికైనా ఫిజికల్‌గా వెళ్లకుండా రియల్, వర్చువల్ ఎలిమెంట్స్ బ్లెండ్ చేసి షూటింగ్ చేసుకునే సౌకర్యాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, క్యూబ్ సినిమా సంయుక్తంగా హైదరాబాద్ లో కల్పించాయి. 'స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్' తో నిర్మాతలు పరిమితమైన బడ్జెట్ లో వర్చువల్ షూటింగ్ జరుపుకోవచ్చని అక్కినేని నాగార్జున చెబుతున్నారు.
నాలుగు దశాబ్దాల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల వాయిదా పడుతూ వచ్చి ఇటీవల విడుదలైన సినిమా ‘ప్రతిబింబాలు’. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా జయసుధ, తులసి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కెయస్. ప్రకాశరావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకులు. ఈ సినిమాను జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించగా రాచర్ల రాజేశ్వర్ విడుదల చేశారు. ఈ సినిమా శతదినోత్సవ వేడుకలను బుధవారం చిత్తూరు జిల్లా అరగొండ కృష్ణటాకీస్ లో నిర్వహించారు. ఈ శతదినోత్సవానికి కారకులైన ఇ. శంకర్ రెడ్డికి, విడుదలకు…
నలభై ఏళ్ళ క్రితం పూర్తయిన అక్కినేని 'ప్రతిబింబాలు' చిత్రం గత ఏడాది నవంబర్ లో విడుదలయింది. ఈ సినిమా చిత్తూరు జిల్లా అరగొండలోని కృష్ణా టాకీసులో వందరోజులు పూర్తి చేసుకున్నట్టు ఓ దినపత్రికలో ప్రకటన వచ్చింది. ఇది ఆ చిత్ర నిర్మాత ఇవ్వలేదు. కొందరు ఏయన్నార్ ఫ్యాన్స్ వారి పేరు లేకుండా ఇచ్చారు.
ANR Vardanti: ఉత్తరాదిన ‘ట్రాజెడీ కింగ్’ అనగానే మహానటుడు దిలీప్ కుమార్ ను గుర్తు చేసుకుంటారు. దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో ఆ ‘ట్రాజెడీ కింగ్’ అన్న మాటకు ప్రాణం పోశారు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. భగ్నప్రేమికులను చూడగానే పాత కథలు గుర్తు చేసుకుంటూ ఉంటారు జనం. అలా విఫలమై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రేమకథల్లో మనకు ముందుగా ‘రోమియో-జూలియట్’,’లైలా-మజ్ను’ వంటివి కనిపిస్తాయి. తరువాత మన దేశం విషయానికి వస్తే ‘సలీమ్- అనార్కలి’, ‘దేవదాసు’ కథలూ స్ఫురిస్తాయి.…