తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాను సందర్శించి విద్యార్థుల సృజనాత్మకతను ప్రశంసించారు. 1970లో కనీస మౌలిక సదుపాయాలు లేని ఈ ప్రాంతంలో దిగ్గజ అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోలను ఎలా స్థాపించారో, అప్పటి నుండి అది హైదరాబాద్‌లోని అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక మరియు సినిమాటిక్ ల్యాండ్‌మార్క్‌లలో ఒకటిగా ఎలా ఎదిగిందో గుర్తుచేసుకుంటూ, సంస్థ యొక్క గొప్ప వారసత్వాన్ని భట్టి విక్రమార్క ప్రశంసించారు. అన్నపూర్ణ కళాశాలలో ప్రపంచ స్థాయి…
కింగ్ నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తెరకెక్కించిన చిత్రం ‘శివ’. అన్నపూర్ణ స్టూడియోస్‌పై యార్లగడ్డ సురేంద్ర, అక్కినేని వెంకట్ నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. శివ సినిమా నాగార్జునకు మాస్ ఇమేజ్ తేవడమే కాక.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పట్లో టాలీవుడ్ ధోరణిని మార్చడమే కాకుండా.. టెక్నికల్‌గానూ ట్రెండ్ సెట్ చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా.. నవంబర్ 14న శివ రీ…
Akkineni Nagarjuna: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆ రూపం. యంగ్ హీరోలకు పోటీగా ఆయన మెయిన్‌టేన్ చేసే ఫిట్‌నెస్. 60వ వడిలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు యూత్‌లో ఫాలోయింగ్ తగ్గలేదంటే ఆయన ఏ రేంజ్‌లో ఫిట్‌నెస్ మీద దృష్టి సారించారో అర్థం చేసుకోవాలి. ఇప్పటికి కూడా చాలా మంది అమ్మాయిల కలల మన్మథుడు నాగార్జున అని స్వయాన నాగ్ కుమారులే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో…
తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ఐకానిక్ చిత్రంగా గుర్తింపు పొందిన ‘మనం’ సినిమా మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. 2014 మే 23న తొలిసారి విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు జపాన్‌లో 2025 ఆగస్టు 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా, అక్కినేని నాగార్జున తన జపనీస్ అభిమానులతో వర్చువల్‌గా సంభాషించనున్నారు. ‘మనం’ సినిమా అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల నటులను ఒకే తెరపై చూపించిన అరుదైన సినిమా. ఈ సినిమాలో దిగ్గజ నటుడు…
2024లో తన శత జయంతిని పూర్తి చేసుకున్న భారతీయ సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు అమూల్యమైన సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రస్తావించారు. “అక్కినేని నాగేశ్వరరావు తన కృషితో తెలుగు సినిమాని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. ఆయన సినిమాల్లో భారతీయ సంస్కృతి, వారసత్వం, విలువల వ్యవస్థను ఎంతో గొప్పగా పెంపొందించారు’ అని తెలియజేశారు. ANR తన ఏడు దశాబ్దాల కెరీర్‌లో తెలుగు సినిమా వృద్ధి, విజయంలో కీలక పాత్ర పోషించిన అనేక…
2024 గానూ ఏయన్నార్ జాతీయ పురస్కార వేడుకల ప్రధానోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో అతిరథమహారధుల సమక్షంలో జరుగుతోంది. ఈ ఏడాది అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ఇస్తున్నట్లు హీరో నాగార్జున గతంలోనే ప్రకటించగా ఆ పురస్కారం ప్రదానం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవగా ఆయన చేతుల మీదుగానే చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. అక్కినేని జాతీయ పురస్కార వేడుకలకు దర్శకులు రాఘవేందర్ రావు, నిర్మాత అశ్వినీదత్, నిర్మాత…
Akkineni Award: అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఒక కీలక ప్రకటన చేశారు. అదేమంటే గత కొన్నాళ్లుగా ఇస్తున్నట్టు ఈ ఏడాది కూడా అక్కినేని నాగేశ్వరరావు అవార్డు ఇస్తున్నామని ఆయన కుమారుడు నాగార్జున ప్రకటించారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు అందించబోతున్నట్టు నాగార్జున ప్రకటించారు. అక్టోబర్ 28వ తేదీన ఒక ఘనమైన వేడుక జరగబోతున్నామని ఆ వేడుకల్లోనే మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు అవార్డుకి అందించబోతున్నట్లుగా ప్రకటించారు. మరో…
ఈ ఏడాది సెప్టెంబర్ 20న నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు100వ జయంతిని పురస్కరించుకుని, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గానైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ ని అనౌన్స్ చేసింది. ఈ ఫెస్టివల్‌లో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాలతో పాటు వరంగల్, కాకినాడ, తుమకూరు, వడోదర, జలంధర్, రూర్కెలా వంటి స్మాల్ సిటీస్ సహా 25 నగరాల్లో సెప్టెంబర్…
Chiranjeevi Emotional Tweet on ANR: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనతో తమకు ఉన్న అనుభూతిని, అనుభవాలను పంచుకుంటున్నారు సినీ ప్రముఖులు. ఇక తాజాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆయనతో తమకు ఉన్న మెమోరీస్ షేర్ చేసుకున్నారు. చిరంజీవి ట్వీట్ చేస్తూ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాననీ అన్నారు. ఆయన తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ…
Akkineni Nageswara Rao Statue to be Unvield Tomorrow: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు తన డెబ్బై ఐదేళ్ల కెరీర్ లో అనేక క్లాసిక్ చిత్రాలలో నటించి సినీ పరిశ్రమ చరిత్రలో చిరస్మరణీయులుగా ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. అదే సమయంలో నటుడిగానే కాకుండా.. స్టూడియో అధినేతగా, నిర్మాతగా అభిరుచిని చాటుకున్న అక్కినేని జయంతి వేడుక సెప్టెంబర్ 20న జరగనుంది. ఆ వేడుకను పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆయన పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అక్కినేని…