తెలుగునాట తారలకు లభించే ఆదరణ అంతా ఇంతా కాదు. ఇక మహానటులకు అయితే మరపురాని ప్రేక్షకాభిమానం లభిస్తుంది. ఓ వైపు నటనతో ఆకట్టుకుంటూనే మరోవైపు స్టార్స్ గా తెలుగునాట జైత్రయాత్ర చేసిన ఘనత యన్టీఆర్, ఏయన్నార్ దే! వారిద్దరూ బాక్సాఫీసు వద్ద ఢీ అంటే ఢీ అంటూ పోటీపడ్డారు. అలాంటి ఈ ఇద్దరు ఏకంగా 14 చిత్రాలలో కలసి నటించారు. సూపర్ స్టార్ డమ్ చూసిన ఇద్దరు మహానటులు అన్ని చిత్రాలలో కలసి నటించింది ప్రపంచంలో మరెక్కడా…