Akkineni Nageswara Rao Statue to be Unvield Tomorrow: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు తన డెబ్బై ఐదేళ్ల కెరీర్ లో అనేక క్లాసిక్ చిత్రాలలో నటించి సినీ పరిశ్రమ చరిత్రలో చిరస్మరణీయులుగా ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. అదే సమయంలో నటుడిగానే కాకుండా.. స్టూడియో అధినేతగా, నిర్మాతగా అభిరుచిని చాటుకున్న అక్కినేని జయంతి వేడుక సెప్టెంబర్ 20న జరగనుంది. ఆ వేడుకను పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆయన పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అక్కినేని కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర పరిశ్రమల ప్రముఖులు కూడా ఆహ్వానించారని, ఉదయం 10 గంటలకు ఈ వేడుక జరగనుందని అంటున్నారు. 1924 సెప్టెంబర్ 20న కృష్ణాజిల్లాలోని రామాపురంలో జన్మించిన అక్కినేని నాగేశ్వర రావు. చిన్ననాటి నుంచీ నాటకాలపై అసక్తితో ఉండేవారు. నాటకరంగం నుండి సినిమాల వైపు వచ్చి తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు.
ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్ టీవీ స్పెషల్ స్టోరీ అసలు సిసలు నవలానాయకుడు అక్కినేని! చదివేయండి
అసలు సిసలు నవలానాయకుడు అక్కినేని!
ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్ టీవీ స్పెషల్ స్టోరీ Akkineni Nageswara Rao : ‘ట్రాజెడీ కింగ్’ అంటే ఆయనే! చదివేయండి
Akkineni Nageswara Rao : ‘ట్రాజెడీ కింగ్’ అంటే ఆయనే!