ANR: అన్నపూర్ణ స్టూడియోస్, క్యూబ్ సినిమాల ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annapurna Studios: ఇండియన్ మీడియా బిజినెస్‌లో దిగ్గజాలు అన్నపూర్ణ స్టూడియోస్, క్యూబ్ సినిమా. ఈ రెండు సంస్థలూ సంయుక్తంగా హైదరాబాద్‌లో ‘ది ఎఎన్నార్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్’ని ఏర్పాటు చేశాయి. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఐసీవీఎఫ్‌ఎక్స్ (ఇన్ కెమెరా విజువల్ ఎఫెక్ట్స్ ) వల్ల ఫిల్మ్ మేకర్స్ ప్రొడక్షన్ ప్రాసెస్‌ని సులభతరం చేయడానికి వీలవుతుంది. ఎఎన్నార్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ఈ విషయం మీద 2022 అక్టోబర్ నుంచి రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు, యాడ్స్, మ్యూజిక్ వీడియోలను కూడా షూట్ చేసింది. వాటన్నిటినీ పరిశీలించాకే వర్క్ ఫ్లో సొల్యూషన్ నాణ్యత బావుందని ఫిల్మ్ మేకర్స్ కి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి హద్దులూ లేకుండా ఫిల్మ్ మేకర్స్ తమ క్రియేటివ్ గోల్స్ అచీవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కటింగ్ ఎడ్జ్, హై బ్రైట్‌నెస్, 60 అడుగుల వెడల్పు, 20 అడుగులు ఎత్తు , 2.3 మిల్లీ మీటర్ల డాట్ పిచ్ (అల్ట్రా హై రెఫ్రెష్ రేట్, వైడ్ కలర్ గమట్) ఉన్న ఎల్‌ఈడీ వాల్ స్పాన్నింగ్ అందులో ఉంటాయి. వాటన్నిటికీ మించి ఆటో లెడ్ డిస్‌ప్లేలుంటాయి. రెడ్‌స్పై, పవర్‌ఫుల్ కస్టమ్ బిల్ట్ రెండరింగ్ సిస్టమ్స్, అన్‌రియల్ ఇంజిన్‌తో కాంప్లెక్స్ ఫొటో రియలిస్టిక్ వర్చువల్ లొకేషన్స్ ని రియల్ టైమ్ రెండరింగ్ చేయడం వంటివన్నీ అద్భుతమైన అంశాలు. వీటన్నిటినీ ఉపయోగించుకుని రియల్, వర్చువల్ ఎలిమెంట్స్ బ్లెండ్ చేసి ప్రపంచంలోని ఎలాంటి ప్రదేశానికైనా ఫిజికల్‌గా వెళ్లకుండా షూటింగ్ చేసుకోవచ్చు. తమ సృజనకు అనుగుణంగా వాతావరణాన్ని, లైటింగ్‌ని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది.
మీడియా, ఫిల్మ్ ఇండస్ట్రీకి అనుకూలమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సేవలు అందించడంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ ముందుంటుంది . సాంప్రదాయబద్ధమైన సినిమా స్టూడియోగా మొదలై, ప్రొడక్షన్ హౌస్‌తో విస్తరించిన ఈ సంస్థ ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టూడియో ఏర్పాటు చేసి వ్యక్తిగతమైన సేవలను అన్నీ హంగులతోనూ ముందుంచుతోంది. మీడియా ఇండస్ట్రీలో తరాలుగా సేవలందిస్తోంది అన్నపూర్ణ బ్రాండ్. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లోనే కాదు, ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీలు అందిపుచ్చుకుంటూ, బిజినెస్ మోడల్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గత మూడు దశాబ్దాలుగా క్యూబ్ సినిమా ప్రస్థానం చెప్పుకోదగ్గది. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు సునాయాసంగా జరగడానికి తనవంతు దోహదపడుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, క్యూబ్ చేయీ చేయీ కలిపి మొదలుపెట్టిన ఈ తాజా ప్రయాణం మెచ్చుకోదగ్గ వినోదాత్మక పర్యావరణానికి, వర్చువల్ ప్రొడక్షన్‌కి ఎంతగానో దోహదపడుతుంది. కంటెంట్ ప్రొడక్షన్‌లో మరో ఆసక్తికరమైన మజిలీని చూడనుంది.
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, “మా వినియోగదారులకు కట్టింగ్ ఎడ్జి సర్వీసులు అందించడానికి ఏఎన్నార్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ తనవంతు కృషి చేస్తుంది” అని అన్నారు. “సినిమాల నిర్మాణంలో మా బలం, మా అనుభవంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో క్యూబ్ కు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మేం చేతులు కలిపాం. సృజనాత్మక రంగంలో ఎలాంటి సరిహద్దులు లేకుండా తెరమీద ఆవిష్కరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాం” అని చెప్పారు.
ప్రముఖ ఫిల్మ్ మేకర్, క్యూబ్ సినిమా కో ఫౌండర్ జయేంద్ర పంచపకేశన్ మాట్లాడుతూ, “అన్నపూర్ణ స్టూడియోతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మన దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న ఫిల్మ్ మేకర్స్ కోసం మేం ఈ అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేస్తున్నాం” అని అన్నారు . “కంటెంట్ ప్రొడక్షన్‌లో ఇది కొత్త యుగం. ఫిల్మ్ మేకర్స్ కి అత్యంత అనువైన, హైలీ ఎఫిషియంట్, కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్‌లో మేం ఈ వెసులుబాటు తీసుకొస్తున్నాం. కంటెంట్ ప్రొడక్షన్‌లో వర్చువల్ ప్రొడక్షన్ అనేది అత్యంత ప్రశంసనీయమైన అభ్యున్నతి. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానంలో మేం ముందంజలో ఉండటం చాలా ఆనందంగా ఉంది” అని చెప్పారు.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!