UP bypolls: ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. 9 అసెంబ్లీ స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయబోవడం లేదని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే ఈ విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ఆరాధన మిశ్రా, ఏఐసీసీ సంస్థ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్…
Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉప ఎన్నికలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే బై ఎన్నికల్లో మొత్తం తొమ్మిది స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు అందరూ తమ పార్టీ ఎన్నికల గుర్తు 'సైకిల్'పైనే పోటీ చేస్తారని వెల్లడించారు.
Samajwadi Party: హర్యానా ఎన్నికల ఓటమి కాంగ్రెస్ పార్టీపై బాగానే కనిపిస్తోంది. ఇండియా కూటమిలో మిత్రపక్షాలైన శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనపై సమీక్ష చేసుకోవాలని ఒమర్ అబ్దుల్లా సూచించారు.
పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు మరణించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఈవై ఉద్యోగిని అధిక పని కారణంగా తనువు చాలించింది. ఈ ఘటన యావత్తు భారతీయల హృదయాలను కలిచి వేసింది. కనీసం ఆమె అంత్యక్రియలకు ఒక్క ఎంప్లాయి కూడా హాజరు కాలేదు. ఈ అంశం మరింత దిగ్భ్రాంతి కలిగించింది.
Kannauj rape case: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత నిందితుడిగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ కన్నౌజ్‌లోని అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో అరెస్టయిన ఎస్పీ నేత నవాబ్ సింగ్ యాదవ్ యొక్క డీఎన్ఏ నమూనా, బాలిక నుంచి సేకరించిన డీఎన్ఏతో మ్యాచ్ అయింది. దీంతో ఈ కేసులో అతడి చుట్టూ మరింత ఉచ్చు బిగిసింది.
Akhilesh Yadav : సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శుక్రవారం తన పార్లమెంటరీ నియోజకవర్గం కన్నౌజ్ చేరుకున్నారు. ఆయన చిబ్రమావులోని ఓ పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్లారు.
Akhilesh Yadav: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఈ కేసుని కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది.
Ayodhya gangrape: అయోధ్య గ్యాంగ్‌రేప్ ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో 12 ఏళ్ల చిన్నారిపై రెండు నెలల పాలు అత్యాచారం జరిగినట్లు తెలిసింది. లైంగిక వేధింపుల కారణంగా మైనర్ గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Akhilesh Yadav : అయోధ్యలో 12 ఏళ్ల మైనర్‌పై జరిగిన అత్యాచారం కేసు రాజకీయ రూపం దాల్చింది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, అయోధ్యలోని పూరకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్‌పై అత్యాచారం చేసిన ఆరోపణలపై సమాజ్‌వాదీ పార్టీ భదర్స నగర్ అధ్యక్షుడు మోయిద్ ఖాన్, సర్వెంట్ రాజు ఖాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.