CM Yogi: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రతిపక్ష నేత సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై విమర్శలు గుప్పించారు. అఖిలేష్ యాదవ్‌ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. బుజ్జగింపులకు పాల్పడే రాజకీయ నాయకులుగా పేరున్న వారు కూడా ఇప్పుడు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళలోని త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు సనాతన ధర్మాన్ని గౌరవిస్తారని ఆశించడం పొరపాటు అవుతుందని యోగి అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. తాజాగా ఇదే అంశంపై బుధవారం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఆప్‌కు మద్దతు ఇవ్వడానికి గల కారణాలు వెల్లడించారు.
గుడి-మసీదు వివాదంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ యోగి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నివాసంలో శివలింగం ఉందని, అక్కడ కూడా తవ్వకాలు జరపాలన్నారు. ఆదివారం లక్నోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంభాల్ సహా పలు జిల్లాల్లో జరుగుతున్న తవ్వకాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
Zia ur Rahman Barq: కరెంటు చోరీకి పాల్పడిన కేసులో ఎస్పీ ఎంపీ జియా ఉర్ రహ్మాన్ బార్క్‌కు విద్యుత్ శాఖ పెద్ద షాకిచ్చింది. ఎస్పీ ఎంపీకి రూ.1 కోటి 91 లక్షల జరిమానా విధించారు. గతంలో విద్యుత్ చౌర్యం కేసులో ఎంపీపై ఆ శాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విద్యుత్ శాఖ ఉద్యోగులను బెదిరించినందుకు ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బుర్కే తండ్రి మమ్లుక్ ఉర్ రెహ్మాన్‌పై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. వివాదాల మధ్య, స్మార్ట్…
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మసీదుల కింద దేవాలయాల కోసం వెతికే వారు శాంతిని కోరుకోలేదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Aaditya Thackeray: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి(ఎంవీఏ)లో విభేదాలకు కారణమవుతోంది. ఇటీవల శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన నేత, ఠాక్రేకి సన్నిహితుడు మిలింద్ నార్వేకర్.. బాబ్రీ మసీదు కూల్చివేత గురించి ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Mayawati: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో పార్టీ నేతని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయావతి సస్పెండ్ చేసింది. అయితే, అతను చేసిన తప్పు ఏంటంటే, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత కుమార్తెతో తన కొడుకు వివాహం జరిపించడమే. ఎస్పీ ఎమ్మెల్యే తిభువన్ దత్ కుమార్తెతో కొడుకు పెళ్లి చేసినందుకు సురేంద్ర సాగర్‌ని బీఎస్పీ నుంచి బహిష్కరించారు. ఇతడితో పాటు రాంపూర్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు ప్రమోద్ సాగర్‌ని తొలగించారు.
Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ ఇటీవల తీవ్ర హింస చెలరేగింది. నగరంలోని షాహీ జామా మసీదు సర్వేకి వెళ్లిన అధికారులపై అక్కడి గుంపు రాళ్ల దాడికి పాల్పడింది. వేల మంది దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు.
అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఒక్క ఓటు కూడా వృథా కానప్పుడే సంపూర్ణ ఫలితాలు వస్తాయన్నారు. యూపీలోని ఓటర్లు తమ ఓటు హక్కును 100 శాతం వినియోగించుకునేందుకు తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారని చెప్పుకొచ్చారు.
Bulldozer Action: బుల్డోజర్ ఇప్పుడు గ్యారేజీలో ఉంటుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ‘‘బుల్డోజర్ న్యాయం’’ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. బుల్డోజర్ జస్టిస్‌కి కేరాఫ్‌గా ఉన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విరుచుకుపడ్డారు. నవంబర్ 20న ఉప ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని 9 నియోజకవర్గాల్లోని సిసామావు నుంచి ఆయన ప్రసంగించారు.