NBK107 సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి దసరాకే రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతూ వస్తోంది. చిత్రీకరణ కూడా గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతుండడంతో.. ఈ సినిమా దసరాకి రావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు దసరాకి సినిమా రాకపోవచ్చని సమాచారం. ఇందుకు కారణం.. బాలయ్యకి కరోనా సోకడమే! ఇటీవల టెస్టులు నిర్వహించగా.. బాలయ్యకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో.. షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది తదుపరి షెడ్యూల్స్‌పై కూడా ప్రభావం చూపింది. తద్వారా…
నందమూరి నటసింహం బాలకృష్ణ 107వ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘క్రాక్’ ఫేమ్ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ టీజర్ నందమూరి అభిమానుల్లో ఈ సినిమా పట్ల అంచనాలను పెంచేసింది. బాలకృష్ణ మార్క్ మాస్ అప్పీల్ తో టీజర్ ఉండటంతో అభిమానులు ఆనంద నర్తనం చేశారు. ఇదిలా ఉంటే… బాలకృష్ణ గత చిత్రం ‘అఖండ’లోని పోరాట…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటజీవితాన్ని పరిశీలిస్తే అబ్బురం అనిపిస్తుంది. ఇప్పుడున్న నటుల్లో బాలకృష్ణనే సీనియర్. ఎన్నెన్నో అపూర్వ విజయాలు, అనితరసాధ్యమైన రికార్డులు బాలయ్య కెరీర్ లో చోటు సంపాదించాయి. బాలయ్య పని అయిపోయింది అన్న ప్రతీసారి ఆయన అనూహ్య విజయాలను సొంతం చేసుకున్నారు. అందుకు ఆయన నటించిన ‘అఖండ’ తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. వసూళ్ళ పరంగానే కాదు, రన్నింగ్ లోనూ బాలకృష్ణ సినిమాల తీరే వేరుగా సాగుతూ ఉంటుంది. ఆయన అభిమానుల తీరు కూడా వేరుగానే కనిపిస్తుంది.…
నందమూరి నటసింహం చిలకలూరిపేటలో సందడి చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్ లో అఖండ సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేశారు నందమూరి బాలకృష్ణ. ఈ వేడుకల్లో దర్శకుడు బోయపాటి శ్రీను, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, అశేష ప్రేక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్య డైలాగ్స్ తో అభిమానుల్లో జోష్ నింపారు. వంద రోజులు వినడమే గగనమైన రోజుల్లో సింహా, లెజెండ్ అఖండ సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం ఆనందంగా…
‘కంచె’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చాయి కానీ విజయాలు మాత్రం కరువయ్యాయి. ఇక చాలా సినిమాల తరువాత అఖండ తో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో అమ్మడి రేంజ్ మారిపోతుందని, ప్రతి సినిమాలో ప్రగ్యా కనిపిస్తుందని అభిమానులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలు అభిమానులకు నిరాశనే మిగిల్చాయి. అఖండ గతేడాది రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు ప్రగ్యా మరో ప్రాజెక్ట్ పై…
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్రం సంచలన విజయం సాధించి, పలు రికార్డులను నమోదు చేసుకుంది. ఈ సినిమా విడుదలయ్యాక పలు క్రేజీ ప్రాజెక్ట్స్ జనం ముందు నిలచినా, `అఖండ` మాత్రం ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతూ ఉండడం మరింత విశేషం. ఈ చిత్రంతో వరుసగా బాలయ్యతో మూడు సినిమాలు తీసి ఘనవిజయం సాధించి, డైరెక్టర్ బోయపాటి శ్రీను `హ్యాట్రిక్` సొంతం చేసుకున్నారు. ఇక ఈ మూడు చిత్రాలలోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడం తెలిసిందే! ఈ కోణంలోనూ…
నందమూరి బాలకృష్ణ “అఖండ” మూవీ 2021 డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో చేసినంత సందడిని మరే ఇతర సినిమాలు చేయలేకపోయాయి. ఇక దేశంలోనే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా “అఖండ” మోత గట్టిగానే మోగింది. ఈ మూవీలో శ్రీకాంత్ విలన్ గా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించగా, ఎస్ఎస్ తమన్…