Balakrishna: దీపావళి నుంచి బాలయ్య కొత్త అవతారం.. కెరీర్లో తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna: నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఇంతవరకు చేయని పని ఇప్పుడు చేయబోతున్నారు. తొలిసారి కమర్షియల్ యాడ్ లో కనిపించబోతున్నారు. తన తోటి హీరోలు యాడ్స్ తో కోట్లు సంపాదిస్తుంటే బాలయ్య మాత్రం వాటి జోలికి వెళ్లలేదు. యాడ్స్ లో నటించకపోవడానికి ఒక కారణం ఉందని ఓ సందర్భంలో బాలయ్య చెప్పారు. తన తండ్రి ఎన్టీఆర్ ఎప్పుడూ ఇమేజ్ ను అడ్డం పెట్టుకొని ప్రకటనల్లో నటించలేదన్నారు. ప్రేక్షకుల వలనే ఈ ఇమేజ్ వచ్చిందని.. అందుకే వాళ్లను మెప్పించే సినిమాలు చేసి వారి అభిమానాన్ని పొందాలని.. అంతేకానీ వాళ్లిచ్చిన ఇమేజ్ ను మన స్వార్ధం కోసం ఉపయోగించకూడదనేది నాన్న గారి అభిప్రాయమని.. ఆయన బాటలోనే తను కూడా ఇప్పటివరకు యాడ్స్ చేయలేదని చెప్పారు బాలయ్య. ప్రజలకు ఏమైనా మేలు జరిగితే మాత్రం తప్పకుండా చేస్తానని చెప్పారు.
Read Also: Ahimsa: ‘అహింస’కు మసాలా అద్దిన డైరెక్టర్ తేజ.. అదిరిపోయిందిగా
Also Read
అన్‌స్టాపబుల్, అఖండ విజయాల తర్వాత బాలయ్యలో చాలా మార్పులు వచ్చాయి. తాజాగా బాలయ్య నిర్ణయం ఆయన అభిమానులకే కాదు, సాధారణ ప్రేక్షకులకు కూడా షాక్ కి గురి చేసింది. ఇంతకీ బాలయ్య తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటంటే.. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఓ కన్‌స్ట్రక్షన్ గ్రూప్ కోసం తెరకెక్కించే యాడ్‌లో బాలయ్య తొలిసారి కనిపించబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీని ద్వారా వచ్చే డబ్బుని బాలయ్య తన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ హాస్పిటల్ లో చాలా మంది క్యాన్సర్ పేషంట్స్ కి అతి తక్కువ ధరలతో ట్రీట్మెంట్ అందిస్తున్నారు బాలయ్య. ఇక తమ అభిమాన హీరో యాడ్ లో నటిస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు.. యాడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Mega 154: ‘వాల్తేరు వీరయ్య’ గా చిరు.. అదిరిపోయిన టీజర్
దీపావళి నుంచి టీవీల్లో యాడ్ ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. మొత్తానికి బాలయ్య యాడ్ రంగంలో అగ్రగామిగానున్న మహేష్, బన్నీ లకు పోటీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. బాలయ్య మాటకు విలువ ఉంటుంది. కచ్చితంగా బాలయ్య యాడ్స్ జనంలోకి బాగా వెళ్తాయి. మరోపక్క బాలయ్య వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నాడు.
This Diwali marks the beginning of our crackling new chapter💥
THE #GODOFMASSES IS STEPPING INTO THE WORLD OF ADVERTISING WITH HIS FIRST-EVER BRAND COMMERCIAL🤩
We're Proudly Announcing #NBK is the New Brand Ambassador for @GroupSaipriya 🤗
Ad By @shreyasgroup @BrandeDigital pic.twitter.com/xOreuOsuqQ
— Shreyas Media (@shreyasgroup) October 22, 2022
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!