నందమూరి నటసింహం బాలకృష్ణ 107వ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘క్రాక్’ ఫేమ్ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ టీజర్ నందమూరి అభిమానుల్లో ఈ సినిమా పట్ల అంచనాలను పెంచేసింది. బాలకృష్ణ మార్క్ మాస్ అప్పీల్ తో టీజర్ ఉండటంతో అభిమానులు ఆనంద నర్తనం చేశారు. ఇదిలా ఉంటే… బాలకృష్ణ గత చిత్రం ‘అఖండ’లోని పోరాట సన్నివేశాలకు మంచి పేరొచ్చింది.
బాలయ్య బాబు, బోయపాటి కాంబోలో వచ్చిన ఆ మూవీ ఘన విజయం సాధించడానికి అందులోని యాక్షన్ పార్ట్ కూడా దోహదపడిందనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. అందుకే ఆ సినిమాలోని కీలక పోరాట సన్నివేశాలను డిజైన్ చేసిన స్టంట్ శివను బాలకృష్ణ తాజా చిత్రం కోసం రంగంలోకి దించారు దర్శకుడు మలినేని గోపీచంద్. స్టంట్ శివతో పాటు ఆయన ఇద్దరు కొడుకులు కూడా ‘అఖండ’లో మాదిరిగానే ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీలో పాలు పంచుకోబోతున్నారు. సో… బాలకృష్ణ 107వ చిత్రం యాక్షన్ సీన్స్ ‘అఖండ’కు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయని భావించొచ్చు!