‘కంచె’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చాయి కానీ విజయాలు మాత్రం కరువయ్యాయి. ఇక చాలా సినిమాల తరువాత అఖండ తో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో అమ్మడి రేంజ్ మారిపోతుందని, ప్రతి సినిమాలో ప్రగ్యా కనిపిస్తుందని అభిమానులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలు అభిమానులకు నిరాశనే మిగిల్చాయి. అఖండ గతేడాది రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు ప్రగ్యా మరో ప్రాజెక్ట్ పై సంతకం చేసినట్లు ఎక్కడ దాఖలాలు కనిపించడం లేదు. అయితే టాలీవుడ్ హవా తో బాలీవుడ్ లో అడుగుపెట్టాలనుకున్న అమ్మడి ఆశలను అడియాశ చేశారు బాలీవుడ్ మేకర్స్.
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘యాంటమ్ ది ఫైనల్ ట్రూత్’ ముందుగా ప్రగ్యాను అనుకోని ఆ తరువాత ఆమెను తొలగించి వేరే హీరోయిన్ ని పెట్టుకున్నారు. ఇక ఈ ఘటన కూడా అమ్మడి కెరీర్ పై ప్రభావం పడింది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. అది నిజమో కాదో తెలియదు కానీ ఈ హాట్ భామ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లు లేవన్న విషయం మాత్రం తెలుస్తోంది. ఇక సోషల్ మీడియా లో నిత్యం హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను ఊరిస్తూ దగ్గరగానే ఉంటుంది. మరి ముందు ముందు ఈ హాట్ భామకు అవకాశాలు అందుతాయా..? లేదా అనేది చూడాలి.