కోవిడ్ -19 సెకండ్ వేవ్ టాలీవుడ్ భారీ సినిమాలు వరుసగా విడుదల తేదీలను ప్రకటించేసాయి. 2022 సంక్రాంతికి పవన్, మహేష్, ప్రభాస్ ఖర్చీఫ్ వేసేశారు. “ఆర్ఆర్ఆర్”ను అక్టోబర్ 13న విడుదల చేస్తామని రాజమౌళి చెప్పాడు. కానీ ఆ విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ నెలాఖరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విడుదల తేదీని ప్రకటిస్తారని అంటున్నారు. “ఆర్ఆర్ఆర్”ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే గనుక జరిగితే బాక్స్ ఆఫీస్ వద్ద…
ప్రస్తుతం నందమూరి నటసింహాం బాలకృష్ణ ‘అఖండ’ సినిమాలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ చేస్తున్న మూడో సినిమా ఇది. దీని తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నారు బాలకృష్ణ. వాస్తవ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. దీని తర్వాత అంటే తన 108వ చిత్రాన్ని బాలకృష్ణ ఎవరితో చేస్తాడనే ప్రశ్న ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.…
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్ర నిర్మాతలు తమిళనాడులోని లొకేషన్ లో క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం తమిళనాడులోని ఒక ఆలయంలో షూటింగ్ జరుగుతోంది. ప్రధాన నటుడితో పాటు మిగతా నటీనటులు కూడా సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సమాచారం ప్రకారం స్టంట్ కొరియోగ్రాఫర్ శివ ఒక యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రాఫ్ చేసాడు. ఇది…
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా ‘అఖండ’లో నటిస్తున్నారు. ‘సింహా, లెజెండ్’ తర్వాత రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల బాలకృష్ణ తన తదుపరి చిత్రాలపైనా క్లారిటీ ఇచ్చారు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా ‘క్రాక్’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన మలినేని గోపీచంద్ తో బాలకృష్ణ మూవీ చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా వార్త వచ్చింది.…
నందమూరి బాలకృష్ణ, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఉండబోతోంది అంటూ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ నెట్స్ట్ తాను చేయబోయే వరుస సినిమాల గురించి వెల్లడించారు. ప్రస్తుతం బోయపాటి “అఖండ”లో నటిస్తున్న ఆయన తదుపరి ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేనితో ఉండబోతోందని వెల్లడించారు. అలాగే ఆ తరువాత అనిల్ రావిపూడితో ఓ చిత్రం, హాసిని అండ్ హారిక బ్యానర్ లో ఓ చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించారు. Read Also : ‘మా’…
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నమూడో చిత్రం ‘అఖండ’ మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణను ‘అఖండ’ గా పరిచయం చేస్తూ వదిలిన టీజర్ కు సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్ లో బాలకృష్ణ నట విశ్వరూపానికి యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. read also : ముద్దులు అయిపోయాయి!…
నటసింహ నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’.. బాలయ్య డబుల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నటుడు శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. కాగా షూటింగ్ దగ్గర పడుతున్న క్రమములో కరోనా సెకండ్ వేవ్ అడ్డుతగిలింది. అయితే అతిత్వరలోనే షూటింగ్ పునప్రారంభం కానున్న నేపథ్యంలో మేకర్స్ లొకేషన్స్ వేటలో పడ్డారు. ఏపీలోని చరిత్రాత్మక ప్రాంతాల్లో చిత్రీకరించడానికి దర్శకుడు బోయపాటి రౌండప్…
నటసింహ నందమూరి బాలకృష్ణ కథా నాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. కరోనా ఉద్ధృతి వల్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పుడు పరిస్థితులన్నీ కుదుట పడటం వల్ల మిగిలిన షూట్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజా షెడ్యూల్ చారిత్రక…
తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయిన లక్ష్మీ రాయ్ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. కెరీర్ ఆరంభంలో సంప్రదాయమైన పాత్రలతో డీసెంట్‌గా కనిపించిన ఈ అమ్మడు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో గ్లామర్ డోస్ పెంచేసి ప్రత్యేక గీతాల్లో తళుక్కుమంటుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ఖైదీ నెం 150 సినిమాలో రత్తాలు రత్తాలు అంటూ కుర్ర కారు చేత మాస్ స్టెప్స్ వేయించేలా ఐటెం భామగా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ…
నందమూరి నటసింహం బాలకృష్ణ “అఖండ” చిత్రం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య అఘోరా పాత్రలో నటిస్తున్నారు. ఫిల్మ్ యూనిట్ ఈ చిత్రాన్ని మే 28 న విడుదల చేయడానికి షెడ్యూల్ చేసింది. కాని మహమ్మారి కారణంగా “అఖండ” విడుదల వాయిదా పడింది. ఇప్పుడు వినాయక చతుర్థి సందర్భంగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ యోచిస్తున్నారు. ఫిల్మ్ యూనిట్ షూట్ తిరిగి ప్రారంభించడానికి ఎదురు చూస్తున్నారు.…